ఇవాళ ముస్లింలకు అత్యంత పవిత్రమైన రోజు. అదే.. రంజాన్ పండుగ. ఈ పర్వదినాన్ని ముస్లింలు ఎంత ఆడంబరంగా జరుపుకుంటారో అందరికీ తెలిసిందే. ఏడాదిలో వాళ్లకు ఉన్న మూడ్నాలుగు పండగల్లో.. ఇదే అతి పెద్దది.
అందుకే.. సంవత్సరం మొత్తం ఎదురు చూసి, ఉపవాసాలు ఉండి మరీ.. ఘనంగా ఈద్ ను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే.. ఈ ఏడాది మాత్రం కరోనా వచ్చిపడింది. దీంతో.. అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.
సోషల్ మీడియాలో ఫొటోలు, పోస్టులు పెట్టి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా తన కుటుంబంతో వేడుకలు జరుపుకుంది. అయితే.. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకునేందుకు కొన్ని ఫొటోలు దిగుదామంటే.. ఒక్కటీ సరిగా రాలేదట!
ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది సానియా. ‘ఫొటోలు దిగేప్పుడు ఎన్ని కష్టాలో..?’ అంటూ ఇన్ స్టా గ్రామ్ లో రాసుకొచ్చింది. దీనికి ఐదు ఫొటోలను కూడా జత చేసింది. ఇందులో ఒక్క ఫొటో మాత్రమే పర్ఫెక్ట్ గా రాగా.. మిగిలిన నాలుగు ఫొటోలు బ్లర్ అయ్యాయి.
ఆ తర్వాత తన కుమారుడితో బీచ్ లో నడుస్తున్న ఫొటోను కూడా షేర్ చేసింది సానియా. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన టెన్నిస్ స్టార్.. కరోనా భారం నుంచి అల్లా రక్షిస్తాడని రాసుకొచ్చింది.