భారత టెన్నిస్ స్టార్ , హైదరాబాదీ అమ్మాయి సానియా మీర్జా ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తన చర్యల ద్వారా కొన్ని సార్లు మంచి పేరు తెచ్చుకుంటారు.. కొన్ని సార్లు వివాదాలతో వార్తల్లో నిలుస్తారు. ఇటీవల మతపరమైన వ్యాఖ్యలతో ఆమె సోషల్ మీడియాలో నెటిజన్లకు టార్గెట్ అయిన సంగతి తెలిసిందే..
క్రిస్టమస్ సందర్భంగా ఈరోజు ఉదయం తన అభిమానులందరికీ సానియా మీర్జా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అయితే క్రిస్టియన్లు ఆమె శుభాకాంక్షలపై హర్షం వ్యక్తం చేయగా..కొందరు ముస్లింల మనసు మాత్రం గాయపడేలా ఆమె ఫొటో పెట్టింది. సానియా మీర్జా షేర్ చేసిన ఫొటోలో తన ఇంట్లో క్రిస్మస్ చెట్టును సానియా ఏర్పాటు చేసి ఆమె తన కుమారుడి పేరుతో ఉన్న శాంటాటోపీని ధరించి ప్రదర్శించింది. దీనిపై కొందరు నెటిజన్లు ఆమెను దారుణంగా కామెంట్ చేశారు.
ముస్లిం యువతిగా ఉండి ఇలా క్రిస్టియన్ మతాచారం ప్రకారం నడుచుకోవడం ఏంటని పలువురు ముస్లిం మతచాంధసవాదులు ట్విట్టర్ లో ఆమెపై విమర్శలు కురిపించారు. ఇలా చేస్తే దేవుడు నిన్ను శిక్షిస్తాడంటూ మరికొందరు నిందలు వేశారు. కొందరు దారుణమైన వ్యాఖ్యలతో బెదిరించారు. సానియా తన మతం నుంచి దూరంగా జరిగిందని.. ఈ ఫొటోతో రుజువు చేసిందని కొందరు కామెంట్ చేశారు. ఇలా ట్విట్టర్ లో ఆమె పెట్టిన పోస్టుపై చాలా మంది మత చాంధసవాదులు విమర్శలు గుప్పించారు.
ఈ విమర్శలకు భయపడిన సానియా మీర్జా తన సోషల్ మీడియా ఖాతా నుంచి ఆ ఫొటోను తొలగించింది. ముస్లిం, మత చాందస వాదులు దాడి నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. భారత దేశం అంటే మత స్వేచ్ఛ.. సానియా ఒక మతాన్ని ఆచరిస్తున్నప్పటికీ ఆమె దేశంలోని భిన్న మతాలను, సంస్కృతులను గౌరవిస్తోంది. రాజ్యాంగం కల్పించిన హక్కును ఆమె వినియోగించుకుంటోంది. కానీ కొందరి మతచాందసవాదం వల్ల ఈరోజు సానియా విమర్శల పాలైంది.