బుజ్జిగాడులో ప్రభాస్ కి మరదలిగా కనిపించిన బ్యూటీ సంజన.. ఈ మధ్య కాలంలో తెలుగులో అంతగా సినిమాలు చేయడం లేదు కానీ.. సర్దార్ గబ్బర్ సింగ్ లో ఓ కేరక్టర్ చేసిందంతే. నిత్యం రోడ్డు మీద కనిపించే సన్నివేశాలు చూసి ఈమె హృదయం ద్రవించిపోయిందట. అందుకే బుజ్జిగాళ్లను.. బుల్లి పిల్లలను కనే విషయంలో ఓ కొత్త కాన్సెప్ట్ ఒకటి చెబుతోంది సంజన.
'వెహికల్స్ నడపాలంటే లైసెన్స్ ఉండాలి.. వస్తువులు అమ్మాలంటే లైసెన్స్ ఉండాలి. అలాగే పిల్లలను కనడానికి కూడా తల్లులకు లైసెన్స్ ఉండాలి' అంటూ సంజన చేసిన సూచన ఇప్పుడు సెన్సేషన్ అయిపోయింది. 'చాలామంది తల్లులు వారి పిల్లలతో రోడ్లపై బిచ్చమెత్తుకు రమ్మని పంపుతున్నారు. ఇంకొందరు అయితే.. అడుక్కునేవారిని చేయడం కోసమే పిల్లలను కంటుంటారు. వీళ్లకు ఒక్కొక్కరికి ఓ లక్ష రూపాయలు చేతికిచ్చి అడుక్కోవడం మానేయమని చెప్పినా వినరు' అంటోంది సంజన.
ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే.. పిల్లలను పెంచే స్తోమత ఆ తల్లులకు ఉందా లేదా అనే విషయం పరిశీలించి.. ఉందని నిర్ధారిస్తే అప్పుడు పిల్లలను కనేందుకు వారికి అనుమతి ఇవ్వాలన్నది సంజన చెబుతున్న మాట. ప్రధాని నరేంద్ర మోడీని తాజాగా కలిసినప్పుడు ఆయనకు కూడా ఈ మాట చెప్పిందట సంజనా గల్రానీ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/