ఆన్ లైన్ ప్రపంచం విస్తృతమయ్యాక దేని గురించి సమాచారం కావాలన్నా క్షణాల్లో దొరికిపోతోంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ పుణ్యమా అని జనానికి ఇబ్బంది లేకుండా సమాచార లభ్యత సులభమయ్యింది. ఇందులో వికీపీడియా పోషిస్తున్న పాత్ర చిన్నదేమీ కాదు. ఇప్పుడు దాని మీద హీరోయిన్ సంజనాకు కోపం వచ్చింది. బుజ్జిగాడులో ప్రభాస్ సరసస సెకండ్ హీరోయిన్ గా త్రిష చెల్లిగా నటించిన సంజనా కన్నడలో మర్డర్ రీమేక్ లాంటి సినిమాల ద్వారా హాట్ మోడల్ గా బాగా పాపులర్. ఆ మధ్య దండుపాళ్య 3లో నగ్నంగా నటించింది అనే దుమారం లేచింది కూడా ఈ భామ గురించే. తర్వాత అది కెమెరా ట్రిక్ అని తేలింది లెండి. ప్రస్తుతం బాహుబలి నిర్మాతలు తీసిన మొదటి టీవీ సీరియల్ స్వర్ణ ఖడ్గంలో రాణిగా ఓ కీలక పాత్ర చేస్తున్న సంజనా దానికి సంబందించిన వివరాలు ఏవి తన వికీపీడియా పేజీలో లేకపోవడం తన అలకకు కారణమట. పవన్ కళ్యాణ్ మోహన్ లాల్ లాంటి స్టార్స్ మూవీస్ లో చేసిన తన గురించి ఎక్కువ ఇన్ ఫర్మేషన్ లేకపోవడం కోపం తెప్పించిందట.
ఇక్కడే తను చిన్న లాజిక్ మిస్ అవుతోంది. వికీపీడియాలో ఎవరి గురించైనా ఏ సమాచారమైనా ఎవరైనా పోస్ట్ చేసే వీలుంటుంది. అదనంగా ఏదైనా జోడించాలి అనుకునేవాళ్లు అక్కడే ఉన్న ఎడిట్ బటన్ ని ప్రెస్ చేస్తే చాలు చిన్న ప్రాసెస్ ద్వారా పూర్తయిపోతుంది. ఇది వికీపీడియా చేసే పని కాదు. ఫ్రీ లాన్సర్స్ తో పాటు ఇన్ ఫర్మేషన్ అప్ లోడర్స్ తమ ఆసక్తిని బట్టి ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ తన గురించి సమాచారం లేదు అనుకున్నప్పుడు సంజనా స్వయంగానో లేదా తన టీమ్ ద్వారానో వాటిని తనకు కావాల్సిన రీతిలో ఎడిట్ చేసుకోవచ్చు. అంతే కానీ అది ఎవరో చేయాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదేమో. అయినా తెలుగు టీవీ సీరియల్స్ గురించి అదే పనిగా వికీపీడియాలో హై లైట్ చేసే ట్రెండ్ అయితే ప్రస్తుతానికి లేదు. పోనీ సంజనా ఫ్యాన్స్ ఎవరైనా ఆ పని చేస్తే బెటర్.