గత కొంతకాలంగా కన్నడ బ్యూటీ సంజన గర్లానీ పేరు రకరకాల వివాదాల్లో హెడ్ లైన్స్ లోకి వచ్చిన సంగతి తెలిసినదే. ఇంతకుముందు శాండల్‌వుడ్ డ్రగ్స్ రాకెట్ లో సంజన పేరు ప్రముఖంగా వార్తల్లోకొచ్చింది. ఆ తర్వాత ఒక లేడీ నిర్మాతతో గొడవ విషయమై కోర్టు వివాదం వేడెక్కించింది.
అయితే అన్ని వివాదాలను మరిపించేలా నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సంజన యోగా క్వీన్ గా మారింది. రకరకాల యోగా భంగిమల్ని పరిచయం చేస్తూ తన విద్యల్ని ప్రదర్శిస్తున్న వీడియోలు ఫోటోలను సోషల్ మీడియాల్లో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి.
సంజన చాలా రిస్కీ ఆక్రో యోగాతో ఆశ్చర్యపరుస్తోంది. అలా గాల్లో తేలి ఒకరి సహాయంతో అసాధారణ ఫీట్స్ వేయడం నిజంగా షాక్ కి గురి చేస్తోంది. ఇవి కచ్ఛితంగా యోగా గురువు సమక్షంలో చేయాల్సిన కఠిన యోగాసనాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సంజన ఇంతకుముందు ప్రభాస్ సరసన బుజ్జిగాడు లో నటించింది. దక్షిణాదిన పలు విజయవంతమైన చిత్రాల్లోనూ నటించిన సంగతి తెలిసిందే.