బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఆసుపత్రి పాలయ్యాడు. అతడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. ఊపిరి తిత్తులు పట్టేశాయి. ఆక్సిజన్ లెవెల్స్ అస్థిరంగా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ని ముంబయిలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నాన్ కోవిడ్ ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ లక్షణాల్ని బట్టి సంజయ్ కు కరోనా ఉంటుందన్న అనుమానంతో పరీక్ష చేయించగా.. నెగెటివ్ వచ్చింది. అయితే మరోసారి టెస్టు చేస్తే కానీ స్పష్టత వచ్చేలా లేదు. సంజయ్ కు ఏమైందో అన్న ఆందోళన నెలకొనడంతో అతడి తరఫున మీడియాకు ఓ స్టేట్మెంట్ వచ్చింది.
తాను క్షేమంగానే ఉన్నానని.. ఆసుపత్రిలో వైద్యులు - నర్సులు తనను చాలా బాగా చూసుకుంటున్నారని.. కోవిడ్ టెస్టు కూడా నెగెటివ్ వచ్చిందని.. ఒకట్రెండు రోజుల్లోనే తాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంటికి చేరుతానని ఆశాభావం వ్యక్తం చేశాడు సంజు. ముంబయిలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బాలీవుడ్లో చాలామంది ప్రముఖులు వైరస్ బారిన పడ్డారు. సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ కరోనాతో ప్రాణాలు వదిలాడు కూడా. అమితాబ్ బచ్చన్ తో పాటు ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ - కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్ - మనవరాలు ఆద్య కూడా కరోనా బారిన పడ్డారు. వీరు ఒక్కొక్కరుగా కోలుకుని ఇంటికి చేరుకున్నారు. చివరగా అభిషేక్.. శనివారమే కరోనా నెగెటివ్ గా తేలాడు.