సౌత్ సినిమాల‌పై సంజ‌య్ ద‌త్ షాకింగ్ కామెంట్స్‌!

Update: 2022-10-22 02:30 GMT
ఇండియ‌న్ సినిమా అంటే అర్ధం మారుతోంది. ఒక‌ప్పుడు ఇండియ‌న్ సినిమా అంటే బాలీవుడ్ మాత్ర‌మే. మిగ‌తా ఇండ‌స్ట్రీల‌ని పెద్ద‌గా లెక్క‌లోకి తీసుకునేవారు కాదు. ప్ర‌పంచ సినిమాకు కూడా ఇండియ‌న్ సినిమా అంటే కేవ‌లం బాలీవుడ్ మాత్ర‌మే. కానీ ఇప్ప‌డు సీన్ మారింది. ఇండియ‌న్ సినిమా అంటే సౌత్ అనే మాట బ‌లంగా వినిపిస్తోంది. అందుకు ప్ర‌ధాన కార‌ణం సౌత్ నుంచి విడుద‌లైన సినిమాల‌కు ఉత్త‌రాది ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డుతూ బాలీవుడ్ సినిమాల‌ని తిర‌స్క‌రిస్తుండ‌ట‌మే.

'బాహుబ‌లి' నుంచి మొద‌లైన ఈ ప‌రంప‌ర అన్ స్టాప‌బుల్ గా సాగుతూ ఉత్త‌రాది ప్రేక్ష‌కుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కేజీఎఫ్‌, పుష్ప‌, కేజీఎఫ్ 2, RRR, కార్తికేయ 2 వంటి సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా సంచ‌ల‌నాలు సృష్టించ‌డంతో బాలీవుడ్ మేక‌ర్స్ తో పాటు స్టార్స్ కూడా మ‌న సినిమాలంటే ఫిదా అవుతున్నారు.

మ‌న సినిమాల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. తాజాగా రిష‌బ్ శెట్టి హీరోగా న‌టించి తెర‌కెక్కించిన 'కాంతార‌' కూడా సంచ‌ల‌నం సృష్టిస్తుండ‌టంతో ఇప్ప‌డు ఎక్క‌డ చూసినా సౌత్ సినిమాలే హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ సౌత్ సినిమాల‌పై ఆస‌క్తిక‌ర కామెంట్ లు చేశారు. 'కేజీఎఫ్ 2'లో అధీరాగా న‌టించి ఆక‌ట్టుకున్న సంజ‌య్ ద‌త్ త‌న‌కు మ‌రిన్ని సౌత్ సినిమాల్లో న‌టించాల‌ని వుంద‌ని త‌న మ‌న‌సులో వున్న కోరిక‌ను బ‌య‌ట‌పెట్టాడు. 'కేజీఎఫ్ 2' త‌రువాత సంజ‌య్ ద‌త్ మ‌రో క‌న్న‌డ సినిమా 'కేడీ : ది డెవిల్‌'లోనూ న‌టిస్తున్నారు. ధృవ్ స‌ర్జా హీరోగా న‌టిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీని కెవిఎన్ ప్రేమ్ తెర‌కెక్కిస్తున్నారు.

రీసెంట్ గా విడుద‌లైన టీజ‌ర్ 'రామాయ‌ణ యుద్దం.. స్త్రీ కోసం.. మ‌హాభార‌త యుద్ధం రాజ్యం కోసం..ఈ క‌లియుగ యుద్ధం కేవ‌లం ర‌క్తం కోసం.. అంటూ టెర్రిఫిక్ విజువ‌ల్స్ తో 'కేజీఎఫ్'ని మించిపోయే క‌థా క‌థ‌నాల‌తో రూపొందుతున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇందులోని కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంజ‌య్ ద‌త్ గురువారం బెంగ‌ళూరులో ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా సౌత్ సినిమాల‌పై త‌న‌కున్న ప్రేమ‌ని వ్య‌క్తం చేశారు.

'నేను 'కేజీఎఫ్' లో చేశాను. ఇప్ప‌డు ప్రేమ్ రూపొందిస్తున్న 'కేడీ : ది డెవిల్‌'లోనూ న‌టిస్తున్నాను. కేడీ టీజ‌ర్ చాలా బాగుంది. సౌత్ లో వారి ప్రేమ‌ను, ప్యాష‌న్ ను, శ‌క్తిని, హీరోయిజాన్ని అన్నింటినీ సినిమాల‌పై కుమ్మ‌రించి చూపిస్తారు. అందుకే ద‌క్షిణాదిలో మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని వుంది. బాలీవుడ్ కూడా సౌత్ సినిమా త‌ర‌హాలో త‌న మూల‌ల‌ని మ‌ర్చిపోకుండా వుంటే బాగుంటుంది' అన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View

Tags:    

Similar News