స్టార్ హీరోకు భార్యతో చెప్పు దెబ్బలు

Update: 2017-09-21 15:30 GMT
ఎంతటి వాడైనా కాంతదాసుడే సంగతేమో కానీ.. భార్యతో తిట్లు చీవాట్లు.. కొండొకచో చెప్పుదెబ్బలు కూడా తప్పవని ఓ నానుడి. జనాల్లో ఇందులో వాస్తవమెంతో.. వాస్తవం ఉన్నా బయటకు చెప్పేవాళ్లెందరో చెప్పలేం. అయితే.. ఆయనో పెద్ద స్టార్ హీరో.. అయినా సరే ఆయనకు భార్యతో చెప్పుదెబ్బలు తప్పలేదట. ఆ విషయాన్ని వేరేవాళ్లు చెబితే సంగతేమో కానీ.. ఆయనే స్వయంగా చెప్పాడు కాబట్టి.. ఇంట్రెస్టింగ్ పాయింట్ అనే చెప్పాలి.

ప్రస్తుతం భూమి మూవీలో నటిస్తున్న సంజయ్ దత్ తాజాగా "యార్ మేరా సూపర్ స్టార్ సీజన్ 2"షోకు వచ్చాడు. ఈ ఆదివారం జూమ్ ఛానల్ లో టెలికాస్ట్ కానున్న ఈ కార్యక్రమంలో తన భార్య షూతో కొడుతుందంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు మున్నాభాయ్. తన షూస్ ను మెక్సికోలో ప్రత్యేకంగా తయారు చేయించుకుంటానని చెప్పిన సంజయ్ దత్.. "ఇవి హ్యాండ్ మేడ్ షూస్. ఆగ్రాలో ఉండే తయారీదారులు వీటిని తయారు చేయలేరు. చాలా కష్టపడి మెక్సికోలో బ్యాక్ ఎట్ ది రాంచ్ అనే షాప్ లో నాకు కావలసినట్లు తయారు చేస్తారని తెలుసుకున్నాను. అప్పటి నుంచి అక్కడే తయారు చేయిస్తున్నాను. తను నాకు కేటలాగ్స్ పంపిస్తాడు. ఇవి లెదర్ కాదు.. ప్లాస్టిక్. అయినా సరే మనకు కావాల్సిన డిజైన్ ఎంచుకునే సౌలభ్యం ఉంటుంది. ఇలాంటి షూస్ నా దగ్గర చాలా ఉన్నాయి" అన్నాడు సంజయ్ దత్.

"వీటిలో చాలా వరకూ షూస్ ను నా భార్య నా తల పై కొట్టడానికి కూడా ఉపయోగిస్తుంది" అంటూ జోక్ చేసి.. నవ్వేశాడు సంజయ్ దత్. ప్రస్తుతం భూమి చిత్రంలో నటిస్తున్న సంజయ్ దత్.. అదితి రావు హైదరికి తండ్రిగా యాక్ట్ చేస్తున్నాడు. తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న అనుబంధం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.
Tags:    

Similar News