కొన్ని విషయాలను మర్చిపోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యం జైలు జీవితంలాంటి వాటిని మళ్లీ ప్రస్తావించకుండా ఉంటానని అంటారు. కానీ సంజయ్ దత్ లాంటి స్టార్ హీరో మాత్రం అందుకు పూర్తిగా విభిన్నం. తన జైలులో తాను గడిపిన జీవితం ఎలా ఉందో.. ఎంతగా బాధ పడ్డాడో కళ్లకు కట్టినట్లు వర్ణించేస్తూ ఉంటాడు.
జైల్లో ఉన్నప్పుడు బాధలు పడ్డం ఏమో కానీ.. ఓ విద్య మాత్రం నేర్చుకున్నాడట సంజయ్ దత్. రీసెంట్ గా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు ఈ భాయ్. ముంబైలో జరిగిన ఈ ఈవెంట్ కు ఈ మున్నాభాయ్ స్పెషల్ గెస్ట్. పనిలో పనిగా పర్యావరణంపై జనాలకు కాసిన్ని క్లాసులు ఇచ్చేశాడు సంజయ్ దత్. అంతే కాదు.. ఇందుకోసం తాను నేర్చుకున్న ఓ విద్యను కూడా చేసి చూపించాడు. అది కూడా జైల్ లో నేర్చుకున్నానని చెప్పడం విశేషం.
ఇంతకీ మున్నాభాయ్ జైల్ లో నేర్చుకున్న విద్య ఏంటి అంటారా? అదే పేపర్ బ్యాగులు తయారు చేయడం. మరి ఇలాంటి సెలబ్రిటీ ఖైదీకి జైల్ లో కాసింత సుకుమారమైన పనులు చెబుతారు. అలా పేపర్ బ్యాగులు చేయడం నేర్చుకున్నాడట. ఆ విషయం చెప్పడమే కాకుండా.. పేపర్ బ్యాగ్ ఎలా తయారు చేయాలో చేసి చూపించాడు కూడా. 'ప్లాస్టిక్ బ్యాగులు వాడ్డం మానేసి, హాయిగా ఇంట్లోనే పేపర్ బ్యాగులు తయారు చేసుకోవచ్చు' అని సెలవిచ్చాడు సంజయ్ దత్.