‘సంజు’ హీరో కూడా డ్రగ్ అడిక్టే..

Update: 2018-07-05 14:16 GMT
సంజయ్ దత్ జీవిత కథతో తెరకెక్కిన ‘సంజు’ సినిమాలో అతడి పాత్రను అద్భుత రీతిలో పోషించి ప్రశంసలు అందుకున్నాడు రణబీర్ కపూర్. ఈ సినిమాకు రణబీర్ వద్దన్న నిర్మాత విధూ వినోద్ చోప్రా సైతం తర్వాత అతడి నటనకు ఫిదా అయిపోయాడు. స్వయంగా ఒక స్టార్ హీరో అయి ఉండి.. మరో స్టార్ హీరోను ఇంత బాగా అనుకరించడం.. ఆ పాత్రలో జీవించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే సంజయ్ దత్ తో తనకు వ్యక్తిగతంగా కొన్ని పోలికలు ఉన్నాయని.. కాబట్టే ఆ పాత్రను బాగా చేయగలిగానని అంటున్నాడు రణబీర్. సంజయ్ లాగే తాను కూడా ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్ అని.. దీంతో పాటు సిగరెట్లు కూడా బాగా కాల్చేవాడినని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు రణబీర్.

కాలేజీ రోజుల్లో మాదకద్రవ్యాలు అలవాటు చేసుకున్నానని.. అది తనపై తీవ్ర ప్రభావం చూపిందని రణబీర్ చెప్పాడు. డ్రగ్స్ వాడితే సమస్యలన్నీ తొలగిపోతాయని.. భవిష్యత్తులో కూడా ఏ ఇబ్బందులూ రావనే భ్రమలో ఉండేవాడినని రణబీర్ చెప్పాడు. తాను డ్రగ్స్ మీద ఎన్నో పరిశోధన చేశానని రణబీర్ అన్నాడు. దీంతో పాటు తనకు నికోటిన్ బలహీనత కూడా ఉండేదని.. అది డ్రగ్స్ కంటే భయంకరమైందని తర్వాత తెలుసుకున్నానని రణబీర్ చెప్పాడు. అలాగే తనకు స్వీట్లు అతిగా తినే బలహీనత కూడా ఉండేదన్నాడు. ఐతే సినిమాల్లోకి వచ్చాక ఈ దురలవాట్లు ఒక్కొక్కదానికే దూరమయ్యానని రణబీర్ చెప్పాడు. మొత్తానికి సంజు లాగే దురలవాట్లు ఉండటం వల్లే రణబీర్ అతడి పాత్రను అంత బాగా చేయగలిగాడన్నమాట. ఎలాగైతేనేం చాలా ఏళ్లుగా సరైన హిట్టు లేక సతమతమవుతున్న రణబీర్.. ‘సంజు’తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. దీన్ని కొట్టే సినిమా ఇంకోటి అతను చేయగలడా అనేది డౌటే.
Tags:    

Similar News