అది చూడలేం.. ఇవి ఎక్కలేదు

Update: 2018-06-30 04:23 GMT
బోలెడంత ఆకలి వేస్తుండి... ఎదురుగా పళ్లెం నిండా పదార్ధాలు ఉంటే కడుపారా భోం చేయవచ్చు. కానీ ఒక్కటంటే ఒక్క ఐటం కూడా రుచీపచీ లేకపోతే అర్ధ కడుపుతోనే లేవాలి. ఇప్పుడు సగటు తెలుగు ప్రేక్షకుడి పరిస్థితి ఇదే. ఈ వీకెండ్ కు ఈమధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా 8 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి.

ఈ వారం ఈ నగరానికి ఏమైంది - శంభో శంకర - యుద్ధభూమి - సంజీవని - నా లవ్ స్టోరీ - కన్నుల్లో నీ రూపమే - మిస్టర్ హోమానంద్ - ఈ నగరానికి ఏమైంది సినిమాలు తెలుగులో రిలీజయ్యాయి. ఇవి కాక హిందీ మూవీ సంజు కూడా థియేటర్లకు వచ్చింది. తెలుగు సినిమాలన్నింటిలో ఈ నగరానికి  ఏమైంది సినిమాకు మాత్రమే కాస్త పాజిటివ్ టాక్ వచ్చింది. పెళ్లిచూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యూత్ కు బాగా నచ్చుతుంది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కు మెప్పించే అవకాశం తక్కువ. మిగతా సినిమాల్లో ఏవీ ప్రేక్షకులను అస్సలు ఆకట్టుకునేలా లేవు. దీంతో థియేటర్లన్నీ కళకళలాడుతున్నా హౌస్ ఫుల్ బోర్డులు ఎక్కడా కనిపించే పరిస్థితి లేకుండా పోయింది.

రణ్ బీర్ కపూర్ నటించిన హిందీ మూవీ సంజుకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. కానీ ఈ మూవీ తెలుగులో డబ్ కాలేదు బి.. సి సెంటర్లలో పెద్దగా ఆడే అవకాశం లేదు. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ బయోపిక్ గా వచ్చిన ఈ మూవీకి సిటీల్లో మాత్రం బాగానే ఆదరణ ఉంటుంది. తెలుగులో ఆకట్టుకునే సినిమాలు లేకపోవడం సంజుకు ప్లస్సయ్యే అవకాశాలు బాగానే ఉన్నాయి.
Tags:    

Similar News