ఘాజీ డైరెక్టర్ మరో పరిశోధన

Update: 2017-10-10 06:08 GMT
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాటి జాతీయ నాయకుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు ఎంతో ప్రత్యేకం. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆజాద్ హింద్ ఫౌజ్ పేరిట సైన్యాన్ని కూడగట్టి యుద్ధం ద్వారా దేశానికి స్వాతంత్ర్యం తేవాలని పోరాడిన యోధుడు ఆయన. ఆ తర్వాత అంతుచిక్కని రీతిలో ఆయన అదృశ్యమైపోయారు. ఆయన ఏమైపోయారు.. ఎందుకు అదృశ్యమైపోయారు అన్నదానిపై ఊహాగానాలే తప్ప ఎలాంటి ధ్రువీకరణలు లేవు. దీనిపై ప్రభుత్వాలు కమిటీలు వేసినా నిక్కచ్చి అయిన నిజం ఏమిటో వెలుగులోకి రాలేదు.

గొప్ప ధీరోదాత్తుడైన నేతాజీపై ఇప్పుడు బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కే ప్రయత్నం జరుగుతోంది. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నది వేరెవరో కాదు.. మన తెలుగువాడే. ఘాజీ సినిమాతో పేరుతెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి ఈ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. నేతాజీ జీవితంపై సుదీర్ఘమైన రీసెర్చ్ చేసిన అనంతరం ఆయన జీవితంలో వెలుగులోకి రాని విషయాలతో ఈ సినిమా స్క్రిప్్ట రెడీ చేస్తున్నాడనేది బాలీవుడ్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న న్యూస్.

సంకల్ప్ ఇంతకు ముందు తీసిన ఘాజీ సినిమా కూడా చరిత్రలో కలిసిపోయిన గాథే. దాయాది దేశం పాక్ మనపై చేయదల్చుకున్న దాడిని మన జలాంతర్గామి ఎలా తిప్పికొ్ట్టిందన్న విషయాన్ని పరిశోధించి తెలుసుకుని మరుగున పడిపోయిన కథకు సినిమా రూపాన్నిచ్చాడు. ఇప్పుడు నేతాజీ జీవితంపైన కూడా అలా కొత్త విషయాలు బయటకు తెస్తాడనే బాలీవుడ్ జనాలు ఆశిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ సంకల్ప్.
Tags:    

Similar News