హీరోల వాయిదాలు.. ఫ్యాన్స్ తూటాలు

Update: 2015-10-31 22:30 GMT
సేఫ్ జోన్ కోసం వాయిదా వేసుకోవడం అనే సంఘటన.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. రిలీజ్ కి రెడీగా ఉన్నా సరే.. పోస్ట్ పోన్ చేసుకుంటున్నట్లు ప్రకటించారు రెండు మూవీల నిర్మాతలు. దీపావళికి రిలీజ్ అని ప్రకటించిన నిఖిల్  శంకరాభరణం, నవంబర్ 5న డేట్ ఇచ్చిన బెంగాల్ టైగర్ వెనక్కు వెళ్లిపోయాయి. ఈ రెండు సినిమాలు అఖిల్ కు సైడ్ ఇవ్వడానికే పోస్ట్ పోన్ కావడంం గమనించాల్సిన విషయం.

రిలీజ్ కి రెడీ అని చెప్పి.. వాయిదా వేస్తుండడంతో ఫ్యాన్స్ మాత్రం బాగా  గుర్రుగా ఉన్నారు. ఈ వేడిని అఖిల్ నిర్మాత నితిన్ బాగానే ఫేస్ చేశాడు. ఆన్ లైన్ లో ఈ కుర్రహీరో కం నిర్మాతను బాగానే తిట్టిపోశారు ఫ్యాన్స్. ఇప్పుడా హీట్ నిఖిల్, మాస్ మహరాజా రవితేజలకు పాకింది. అఖిల్ కోసం వాయిదా వేసుకోవడం ఏంటి అని ఆన్ లైన్ ద్వారా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ముఖ్యంగా బెంగాల్ టైగర్ విషయంలో అయితే నెల ముందే డేట్ ఇచ్చారు. శంకరాభరణం కూడా దాదాపు అంతే. కానీ ఇప్పుడు అఖిల్ కోసం ఈ రెండూ వెనక్కెళ్లాయి. బెంగాల్ టైగర్ 5న వస్తుందని తెలిసినపుడు.. అఖిల్ నే ఓ  వారం ఎందుకు వెనక్కు వెళ్లమని చెప్పలేదంటూ ప్రశ్నిస్తున్నారు వీరాభిమానులు. ఈ ఫ్యాన్స్ ఆవేశం అర్ధం చేసుకోదగ్గదే కానీ.. చూసి చూసి చేజేతులా నిర్మాతలు వ్యాపారాన్ని చెడగొట్టుకోలేరు కదా.. ఆలోచించండి ఫ్యాన్స్. మీకంటే అభిమానం. వాళ్లకి వ్యాపారమే కదా.


Tags:    

Similar News