2018 సంక్రాంతి.. వన్ సైడ్ అయ్యిందే

Update: 2017-11-06 23:30 GMT
టాలీవుడ్ లో పండుగ సీజన్ లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అన్నిటిలోకి సంక్రాంతికి అయితే మహా క్రేజ్. సినిమా రిలీజ్ లకు బెస్ట్ టైం ఇది మనోళ్ల కాన్ఫిడెన్స్. పైగా సంక్రాంతి హీరో అనిపించుకునేందుకు కూడా ఉత్సాహం చూపిస్తారు. అందుకే సంక్రాంతికి పోటాపోటీగా సినిమాలు వచ్చే కల్చర్ మన దగ్గర ఉంది.

ఓ సారి గతాన్ని చూస్తే.. మహేష్‌ వర్సెస్ చరణ్‌.. మొన్న చిరంజీవి వర్సెస్ బాలయ్య.. ఇలా మంచి పోటీ ఏర్పడింది. కానీ 2018 సంక్రాంతి సీజన్ పెద్దగా మజా ఇచ్చేటట్లుగా కనిపించడం లేదు. ఈ సారి సంక్రాంతి సినిమాలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయాయి. పవన్ కళ్యాణ్25 వ చిత్రం అజ్ఞాతవాసి(టైటిల్ ఇంకా కన్ఫాం కాలేదు) జనవరి 10న విడుదల కానుంది. జనవరి 11న అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భాగమతి.. జనవరి 12న నందమూరి బాలకృష్ణ జైసింహా.. సూర్య నటించిన తానా సేరేంద్ర కూట్టం డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కానుండగా.. జనవరి 13న రవితేజ టచ్ చేసి చూడు.. జనవరి 14న రాజ్ తరుణ్ రాజుగాడు విడుదల కానున్నాయి.

ఈ లిస్ట్ చూస్తే.. పవన్ కళ్యాణ్‌ వర్సెస్ ఇతర హీరోలు.. అంతగా కిక్ రావట్లేదు. వేరే పెద్ద హీరోలు ఉంటే జనాలకు కూడా బాగా మజా వచ్చేది. కానీ పవన్ డిజాస్టర్ సినిమాకు కూడా మినిమం 60 కోట్లు వచ్చేస్తాయి. మిగిలిన సినిమాల్లో ఏదీ ఈ స్థాయి మూవీ లేదు. అందుకే 2018 సంక్రాంతికి వార్ వన్ సైడ్ అయిపోయిందని చెప్పవచ్చు.
Tags:    

Similar News