తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పోటీలో ఎవరు విజేత అన్నది ఇంకా తేలలేదుగానీ అమెరికాలో మాత్రం సంక్రాంతి విజేత ఎవరో తేలిపోయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'F2' నే విజేతగా తేలింది. భారీ అంచనాల నడుమ విడుదలయిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' ప్రీమియర్ కలెక్షన్స్ డీసెంట్ గా ఉన్నప్పటికీ తర్వాత మాత్రం యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. అదే 'వినయ విధేయ రామ'కు ప్రీమియర్లకు సైతం డీసెంట్ కలెక్షన్స్ రాలేదు. కానీ 'F2' మాత్రం ప్రీమియర్స్ తోనే తన సత్తా చాటి.. ఆతర్వాత అదే ఊపును కొనసాగిస్తోంది.
మొదటి వీకెండ్ లో 'F2' $ 870K గ్రాస్ కలెక్షన్స్ సాధించి వన్ మిలియన్ డాలర్స్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. ఈ కలెక్షన్ సాధించేందుకు శనివారం ఆదివారం వసూళ్లతో పాటుగా శుక్రవారం ప్రీమియర్స్ తోడ్పడ్డాయి. 'ఎన్టీఆర్ కథానాయకుడు' విషయం తీసుకుంటే ఇప్పటివరకూ $ 825K గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. మొదటి రోజునుండే కలెక్షన్స్ వీక్ గా ఉండడంతో ఐదు రోజుల తర్వాత కూడా 1 మిలియన్ మార్కును టచ్ చేయలేకపోయింది. ఈ సినిమా ఓవర్సీస్ లో లాస్ వెంచరే.
ఇక 'వినయ విధేయ రామ' పరిస్థతి మరీ దారుణంగా ఉంది. మొదటి వీకెండ్ లో ఈ సినిమా $ 235K గ్రాస్ వసూళ్లు మాత్రమే సాధించింది. ఈ లెక్కన యూఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినట్టే. 'వినయ విధేయ రామ'.. 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాలతో పోస్తే 'F2' ఓవర్సీస్ హక్కులను తక్కువ రేటుకు అమ్మడం తో త్వరలోనే యూఎస్ డిస్ట్రిబ్యూటర్ లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.