`96` సక్సెస్ తో అనూహ్యంగా కంబ్యాక్ అయిన త్రిష ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. అలాగని కెరీర్ పరంగా నెమ్మదిగా ఏం లేదు. తమిళంలో వరుస అవకాశాలు తనని వరించినా తనే ఎంపిక ల పరంగా ఆచితూచి అడుగులేస్తోంది. అయితే ఇటీవలి కాలంలో టాలీవుడ్ సర్కిల్స్ లో బొత్తిగా నల్లపూస అయిపోయింది. మెగాస్టార్ సరసన ఛాన్స్ దక్కినా కానీ ఎందుకనో దానిని తృణ ప్రాయంగా వదులుకుని ఔరా! అనిపించింది. తాజాగా ఓ క్రేజీ టాలీవుడ్ హీరో సరసన త్రిష అవకాశం దక్కించుకుందున్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
త్రిష కృష్ణన్ ఇటీవల హైదరాబాద్ నగరం నుండి వెళుతూ విమనాశ్రయంలో కెమెరా కంటికి చిక్కింది. ముసుగుతో ముఖాన్ని కప్పి ఉంచడంతో ఎవరూ అంతగా గుర్తించలేకపోయారు. ఇక ఇన్ స్టా వేదికగా త్రిష ఎంతో అబగా ఆరగిస్తున్న ఫోటో ఒకటి అంతర్జాలంలో రివీలైంది.
స్వతహాగానే త్రిష మంచి భోజన ప్రియురాలు. నచ్చినవి ఆరాంగా ఆరగించే అలవాటుంది. అప్పుడప్పుడు డైట్ పాటిస్తుంది మినహా తన శరీర తత్వానికి ఎంత తిన్నా కనిపించదని ఇంతకుముందే చెప్పింది. అయితే బరువు తగ్గేందుకు ఎంతో శ్రమిస్తూనే .. అప్పుడప్పుడు ఇలా ఫుల్ గా లాగించే అవకాశాన్ని సద్వినియోగం చేస్తోందని తాజా ఫోటో చెబుతోంది. త్రిష ఇటీవల సన్నజాజి తీగలా మారిపోయింది అంటే దీనివెనక ఏదో కఠోరమైన ప్రయత్నం దాగి ఉందనే అర్థం. తదుపరి గౌతమ్ మీనన్ సహా పలువురు దర్శకులతో సినిమాలు చేసేందుకు త్రిష సిద్ధమవుతోంది. శింబు సరసన ఓ మూవీలో చేస్తోంది. పరమపదం-గర్జనై-శతురంగ వేట్టై 2- రాగిణి-సుగర్-రామ్- పొన్నియన్ సెల్వన్ .. ఇలా అరడజను పైగా సినిమాలతో త్రిష బిజీబిజీగా ఉంది.