కాస్త పేరున్న సినిమాలు విడుదలవుతుంటే.. వాటి మీద ఏదో ఒక కేసు పెట్టి.. దర్శక నిర్మాతల్ని కోర్టుకు లాగడం అన్నది కోలీవుడ్లో ఈ మధ్య మామూలైపోయింది. రజినీకాంత్.. మురుగదాస్.. కమల్ హాసన్.. శింబు లాంటి వాళ్లు ఈ మధ్య తమ సినిమాల విడుదలకు ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా కమెడియన్ టర్న్డ్ హీరో సంతానం కూడా ఇదే రకమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. సంతానం లేటెస్ట్ మూవీ ’దిల్లుకు దుడ్డు’ విడుదల కాకుండా ఆపేయాలంటూ మహ్మద్ మస్తాన్ అనే నిర్మాత చెన్నై సివిల్ కోర్టును ఆశ్రయించాడు.ఈ చిత్ర దర్శకుడు రామ్ బాలా తనను మోసం చేసి.. తన కథతో సంతానం హీరోగా సినిమా తీశాడన్నది అతను చేస్తున్న ఆరోపణ.
మస్తాన్ చెబుతున్నదాని ప్రకారం.. రామ్ బాలాతో అతను ఇంతకుముందు ఓ సినిమా చేయడానికి అంగీకారం కుదుర్చుకున్నాడట. అందుకోసం కథ కూడా ఇచ్చాడట. రూ. 11 లక్షలు పారితోషికంగా మాట్లాడుకుని..రూ.3 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడట. శివ.. నందితలను హీరో హీరోయిన్లుగా అనుకుని వాళ్లకు అడ్వాన్స్ కూడా ఇచ్చాడట. ఐతే అంతా ఓకే అయ్యాక రామ్ బాలా తనకు హ్యాండ్ ఇచ్చి.. తన కథతోనే సంతానం హీరోగా సినిమా మొదలుపెట్టాడని.. ఈ విషయమై సంతానంను అడిగితే.. ముందు రామ్ బాలాతో సినిమా చేయట్లేదని అబద్ధం చె్ప్పి.. తర్వాత నిలదీస్తే ఏం చేస్కుంటావో చేస్కోమన్నాడని.. తాను ఈ సినిమా కోసం రూ.81 లక్షలు ఖర్చు చేశానని.. ’దిల్లుకు దుడ్డు’ రిలీజైతే అదంతా నష్టపోతానని.. కాబట్టి తనకు న్యాయం చేసేవరకు సినిమాను ఆపేయాలని కోరాడు మస్తాన్. దీంతో సంతానం.. రామ్ బాలాలను కోర్టుకు హాజరు కావాలని కోర్టు నోటీసులిచ్చింది. ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.