ప్రముఖ దర్శకుడు దివంగత శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. సినిమాల ఫలితం తో సంబంధం లేకుండా అంది వచ్చిన ఆఫర్లను చేసుకుంటూ ఈ యువ హీరో దూసుకు పోతున్నాడు. కెరీర్ ఆరంభంలో ప్రభాస్ తో పాటు ఇంకా పలువురు స్టార్స్ మద్దతు దక్కించుకున్న సంతోష్ శోభన్ ఇప్పుడు సొంత ఇమేజ్ తో దూసుకు పోయే ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఓటీటీ.. థియేటర్ రిలీజ్ సినిమాలను బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ఈ యువ హీరో ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సంతోష్ శోభన్ మూవీ చాలా సైలెంట్ గా సాగుతోంది. సినిమా కు భారీ గా పబ్లిసిటీ చేయకుండా సింపుల్ గా షూటింగ్ ను ముగించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల ఒక లాంగ్ షెడ్యూల్ ను మారేడుమిల్లి ప్రాంతంలో ముగించారు. అక్కడ షూటింగ్ ను పూర్తి చేసి యూనిట్ సభ్యులు హైదరాబాద్ చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది. సినిమా పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఇప్పటి వరకు మేర్లపాక గాంధీ నుండి వచ్చిన సినిమాలు మంచి ఫలితాన్ని దక్కించుకున్నాయి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మొదలుకుని నితిన్ తో తెరకెక్కించిన మాస్ట్రో వరకు మినిమం సక్సెస్ అయ్యాయి.
కనుక ఈ సినిమా కూడా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. సంతోష్ శోభన్ గత చిత్రం ఏక్ మినీ కథ కు మేర్లపాక గాంధీ కథను అందించాడు. ఆ సినిమాకు రచయితగా వ్యవహరించిన మేర్లపాక గాంధీ ఈసారి సంతోష్ శోభన్ తో పూర్తి స్థాయి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వీరిద్దరి కాంబో ఒక పక్కా కమర్షియల్ పైసా వసూల్ సినిమాను తెచ్చి పెడుతుందనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు.
సినిమా షూటింగ్ అంతా పూర్తి చేసిన తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం అతి త్వరలోనే వెళ్లడించే అవకాశాలు ఉన్నాయి. సంతోష్ శోభన్ తో మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ముగించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా కు సంబంధించిన మరిన్ని విషయాలతో యూనిట్ సభ్యులు త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.