స‌ప్త‌గిరి రేంజ్ అంతుందా?

Update: 2019-04-17 03:58 GMT
మీడియం బ‌డ్జెట్ సినిమాల‌తో క‌మెడియ‌న్ గా పాపుల‌రై అటుపై హీరోగా మారాడు స‌ప్త‌గిరి. స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్ - స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బి అంటూ ఎమోష‌న‌ల్ కామెడీ సినిమాలు చేశాడు. క్యారెక్ట‌ర్ న‌టుడిగా కెరీర్ ని కొన‌సాగిస్తూనే హీరోగా ప్ర‌య‌త్నించాడు. కొంత గ్యాప్ వ‌చ్చినా స‌ప్త‌గిరి వ‌రుస‌గా హీరోగా సినిమాలు చేయ‌డం టాలీవుడ్ లో మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం హీరోగా అత‌డి రేంజ్ ఎంత‌? అంటూ ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు.

అన్న‌ట్టు అత‌డి సినిమాల మార్కెట్ రేంజ్ ఎంత‌? అంటే దాదాపు 3-4 కోట్ల మ‌ధ్య బిజినెస్ జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది. స‌ప్త‌గిరి ఎల్.ఎల్‌.బి ద‌ర్శ‌కుడు చ‌ర‌ణ్ ల‌క్కాకుల‌ అందించిన వివరాల ప్ర‌కారం.. ``స‌ప్త‌గిరి సినిమాల‌కు మార్కెట్లో డిమాండ్ ఉంది. సప్త‌గిరి ఎక్స్ ప్రెస్ - స‌ప్త‌గిరి ఎల్.ఎల్‌.బి చిత్రాలు ప్ర‌చారం జ‌రిగినంత న‌ష్టాలు తేలేదు. ప్ర‌స్తుతం అత‌డు న‌టిస్తున్న తాజా చిత్రం వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర గోవింద చిత్రానికి మార్కెట్లో డిమాండ్ ఏర్ప‌డింది. ఈ సినిమాకి 3- 4కోట్ల మేర బిజినెస్ చేశారు అని తెలిపారు.  ఏపీ రిలీజ్ హ‌క్కుల్ని ప్ర‌ముఖ పంపిణీదారుడు బ్ర‌హ్మయ్య ఛేజిక్కించుకున్నార‌ని వెల్ల‌డించారు.

సప్తగిరి హీరోగా అరుణ్‌ పవార్‌ దర్శకత్వంలో శివ శివమ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై నరేంద్ర యెడల - జీవీఎన్‌ రెడ్డి నిర్మిస్తున్న  `వజ్ర కవచరధర గోవింద` నిర్మాణానంత‌ర ప‌నులు పూర్తి చేసుకుని మేలో రిలీజ్ కి రెడీ అవుతోంది. తాజాగా ప్ర‌సాద్ లాబ్స్ లో జ‌రిగిన ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పంపిణీదారుడు బ్ర‌హ్మ‌య్య మాట్లాడుతూ.. ``సప్తగిరిపై ఉన్న నమ్మకంతో ఈ సినిమాను హక్కుల్ని కొన్నాం. ఆయన నటించిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ - సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి విజ‌యం అందుకున్నాయ‌న్న న‌మ్మ‌కంతో నే తీసుకున్నాం`` అన్నారు. రంగస్థలం - ఆర్‌ ఎక్స్‌100 - గీత గోవిందం లాంటి ఎన్నోసూపర్‌ హిట్‌ సినిమాల్ని పంపిణీ చేసిన ఆయ‌న ఏపీ హ‌క్కుల్ని ఛేజిక్కించుకున్నామ‌ని తెలిపారు. లక్ష్యం గొప్పది అయినా వెళ్లే మార్గం మంచిది అయితేనే ఆ దేవుడి సహకారం ఉంటుంది.. అనే ఒక డివైన్‌ పాయింట్‌ తో ఈ సినిమా తెరకెక్కింద‌ని స‌ప్త‌గిరి తెలిపారు. హిలేరియ‌స్ కామెడీ చిత్ర‌మిద‌ని అన్నారు.




Tags:    

Similar News