తెలుగు సూపర్ హిట్ మూవీ 'టెంపర్' ను హిందీలో 'సింబా' టైటిల్ తో రీమేక్ చేసిన విషయం తెల్సిందే. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మించాడు. రణ్ వీర్ సింగ్ మరియు సారా అలీ ఖాన్ జంటగా నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. వంద కోట్లు వసూళ్లు చేస్తే పెద్ద విజయం అనుకున్నారు. కాని ఏకంగా 350 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. ఈ చిత్రం కలెక్షన్స్ పరంగానే కాకుండా యూట్యూబ్ లో మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది.
'సింబా' చిత్రంలోని రీమిక్స్ సాంగ్ ఆంఖ్ మారే... కు యూట్యూబ్ లో సంచలన వ్యూస్ వచ్చాయి. కేవలం 41 రోజుల్లో ఏకంగా 300 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒక ఇండియన్ మూవీ సాంగ్ కు ఇంత తక్కువ సమయంలో అంత ఎక్కువగా వ్యూస్ రావడం రికార్డుగా బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం సినిమా వసూళ్ల పరంగా రికార్డులు సాధిస్తూ ఉంటే, ఈ పాట మాత్రం వ్యూస్ పరంగా రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఈ జోరు ఇలాగే కొనసాగితే ఆల్ టైం అత్యధిక వ్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ జిందా సినిమాలోని స్వాగ్ సే స్వాగత్ పాట 685 మిలియన్ వ్యూస్ తో టాప్ లో ఉంది. ఆంఖ్ మారే.. సాంగ్ త్వరలోనే టైగర్ జిందా సాంగ్ రికార్డును కూడా చేరే అవకాశం ఉందని యూట్యూబ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 90 లలో వచ్చిన సాంగ్ కు రీమిక్స్ గా ఆంఖ్ మారే సాంగ్ వచ్చింది. ఈ పాట సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
Full View