ఒకసారి యాక్సెప్ట్ చేస్తే నెపోటిజం పట్టించుకోరు!

Update: 2019-06-05 06:33 GMT
స్టార్ కిడ్స్ అంటే రెడీ మేడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని.. ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ సులువుగా దొరుకుతుందని.. అత్తెసరు టాలెంట్ తోనే నెట్టుకురావచ్చని చాలామందికి అభిప్రాయం ఉంటుంది.  చాలామంది స్టార్ కిడ్స్ ను చులకనగా కూడా చూస్తారు. స్టార్ కిడ్స్ కు అడ్వాంటేజ్ ఉన్న మాట వాస్తవమే కానీ అదొక్కటే వారిని తమ కెరీర్ లో నిలబెడుతుందని .. అదే వారికి స్టార్ డమ్ వచ్చేలా చేస్తోందనే దానిలో నిజం లేదు.  ఎంట్రీ ఈజీగానే దొరికినప్పటికీ వారు కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది.  స్టార్ట్ కిడ్ కదా అని డ్యాన్స్ వేయను.. బికినీ వేసుకోను.  లిప్ లాక్ చెయ్యను అంటే అవకాశాలు ఇస్తారా?

బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ప్రస్తుతం అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. సైఫ్ అలీ ఖాన్ - అమృతా సింగ్ ల ముద్దుల కూతురిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సారా నటించిన రెండు సినిమాలు 'కేదార్ నాథ్'.. 'సింబా' సూపర్ హిట్ కావడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.  రీసెంట్ గా 'బాజార్' అనే మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరోయిన్ గా మారక మునుపు తన బరువు 96 కేజీలు ఉండేదని తెలిపింది.  PCOS హెల్త్ ప్రాబ్లెం కారణంగా అలా బరువు పెరిగిందట. అయితే దాదాపుగా ఏడాదిన్నర పాటు కఠినమైన కసరత్తులు.. డైట్ ప్లాన్ ఫాలో అయ్యి 40 కేజీలు తగ్గానని చెప్పింది.  "అందరూ సమానత్వం అని పెద్ద మాటలు మాట్లాడతారు .. కానీ సినిమాలో హీరోయిన్ కనుక 96 కేజీలు ఉంటే చూస్తారా?"అంటూ ప్రశ్నించింది.  ఎంత బరువు ఉండాలో అంత బరువు ఉండడం అనేది ఆరోగ్యం.. కాన్ఫిడెన్స్ అని చెప్పింది.

ఇక నెపోటిజం విమర్శల గురించి ప్రస్తావించినప్పుడు.. "జనాలు స్టార్ కిడ్స్ కు అనవసరమైన అడ్వాంటేజ్ ఉంటుందనే ఉద్దేశంలో ఉన్నారు.  నా వరకూ చూస్తే..నన్ను నేను ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడ్డాను.  మిమ్మల్ని వర్క్ విషయంలో ఒకసారి యాక్సెప్ట్ చేస్తే నెపోటిజం లాంటి మిగతా విషయాలను జనాలు పట్టించుకోరు" అని అభిప్రాయపడింది.  ఒక లెజెండరీ ఫ్యామిలీలో పుట్టినందుకు గర్వపడుతున్నానని.. అమ్మనాన్నల పేరు నిలబెట్టేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది.

    
    
    

Tags:    

Similar News