ఓవైపు ముంబైని మహమ్మారీ అట్టుడికిస్తోంది. మరోవైపు ఎడతెరిపి లేని వర్షాలు అల్లకల్లోలం చేస్తున్నాయి. ఇది రేర్ మూవ్ మెంట్. ఇలాంటి సన్నివేశంలో ముంబై జనం అస్సలు నడి రోడ్డుపైకి రావాలంటేనే గజగజ ఒణుకుతున్నారు. నిత్యం కరోనా కేసులతో రికార్డులు మోగిస్తున్న ముంబైని వరదలు వైపరీత్యాలు కూడా ఊపిరాడనివ్వడం లేదు. ఇలాంటి సన్నివేశంలో ఆ స్టార్ కిడ్స్ ఆరు బయట ఆటలు చూశారా?
పటౌడీ వారసుడు సైఫ్ అలీఖాన్ పుత్రరత్నం.. సుపుత్రిక ఇదిగో ఇలా చిటపట చినుకుల్ని జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. విలయం వీళ్లను అస్సలు బయపెట్టినట్టు లేదు! ఆరుబయట అరుదైన అవకాశాన్ని అస్సలు జారవిడుచుకునే ఆలోచనే లేదు ఆ ఇద్దరికీ. సైఫ్ ఖాన్ కుమారుడు ఇబ్రహీం ఖాన్.. తన సోదరి సారా అలీఖాన్ ని ఇలా భుజం పైకి కోతిపిల్ల ఎక్కించుకున్నాడు. అన్నా చెల్లెళ్లు ఇద్దరూ చిటపట చినుకుల్లో తడిసి ముద్దవుతూనే సరదా వేషాలు వేస్తున్నారు.
అన్నట్టు నెపోటిజం( నటవారసత్వం) పై చర్చ జరుగుతున్నప్పుడు .. అప్పుడే తొందరపడటం సరికాదు! అంటూ సైఫ్ ఖాన్ వారించబోయాడు. ఆ తర్వాత అతడిపై వ్యతిరేకతతో పాటు ఒక సెక్షన్ నుంచి సానుకూలత కూడా వ్యక్తమైంది. సైఫ్ కుమార్తె సారా అలీఖాన్ సరసన కేదార్ నాథ్ చిత్రంలో సుశాంత్ సింగ్ నటించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో సారా అలీఖాన్ సవతి తల్లి కరీనా కపూర్ ఊహించని కామెంట్ చేసింది. నువ్వు ఎవరితో ప్రేమలో పడినా సుశాంత్ ని మాత్రం ప్రేమించవద్దు. ఆ ముఖం అంత అంద వికారంగా ఉంటుందని కామెంట్ చేసి నిప్పులు పోసింది సైఫీనా. ఆ నిప్పు ఇప్పటికీ కాల్తూనే ఉంది.