బాలీవుడ్ లో కొవిడ్ 19 మహమ్మారీ అంతకంతకు భయాందోళనలకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబంలో ఏకంగా నలుగురికి పాజిటివ్ అన్న వార్తలతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమితాబ్-అభిషేక్-ఐశ్వర్యారాయ్- ఆరాధ్యలకు పాజిటివ్ అని తేలడంతో ఫ్యాన్స్ కంగారు పడ్డారు. వ్యాప్తంగా అభిమానులు దేవుళ్లకు పూజలు పునస్కారాలు చేస్తూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. తమ అభిమాన తారల విషయంలో ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడితో అయిపోలేదు. ముంబైలో మహమ్మారీ అంతకంతకు ఉధృతమవుతున్న వేళ ఇతర సెలబ్రిటీలకు అది వేగంగా పాకుతోంది. తాజాగా సైఫ్ అలీఖాన్ కుమార్తె .. కుర్ర హీరోయిన్ సారా అలీఖాన్ డ్రైవర్ కి కొవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో అందరిలానే ఆందోళన చెందిన సారా కుటుంబం వెంటనే ఆస్పత్రిలో కొవిడ్ టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో సారాకు కానీ ఇతర కుటుంబీకులకు కానీ కొవిడ్ సోకలేదని తేలింది. ఈ విషయాన్ని సారా స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం డ్రైవర్ ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్భంధ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తోంది.
ఇక సారా అలీ ఖాన్ వర్ధమాన తారగా బాలీవుడ్ లో వెలుగులు విరజిమ్ముతోంది. వరుసగా స్టార్ హీరోల సరసన భారీ చిత్రాలకు సంతకాలు చేసింది. సారా నటించిన కూలీనంబర్ 1 రిలీజ్ కావాల్సి ఉంది. అలాగే పలు చిత్రాలు సెట్స్ కి వెళ్లాల్సి ఉండగా కొవిడ్ వల్ల వాయిదా పడ్డాయి.