హీరో కూతురు కోసం ప్రభాస్ వెయిటింగ్?

Update: 2018-01-27 17:19 GMT
బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత పొందిన ప్రభాస్ ఇప్పుడు సాహో సినిమాతో మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమా తర్వాత మన రెబెల్ స్టార్ జిల్ సినిమా దర్శకుడు రాధ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమాను సైన్ చేయడం జరిగింది.

ఈ సినిమా లోకి ప్రభాస్ పక్కన హీరోయిన్ కోసం అన్ని ఇందుష్ట్రీలను జల్లెడ పడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్యనే దీపికా పదుకొనె ను కలవగా ఆమె పద్మావతి రిలీజ్ తర్వాత చెప్తానంది. ఇపుడు ఆ సినిమా రిలీజ్ అవ్వడమేంటి పెద్ద హిట్ కూడా అయింది. కానీ దీపికా మాత్రం ప్రభాస్ సినిమాకు హాండ్ ఇచ్చింది. కాబట్టి మళ్ళీ వేట ప్రారంభించారు. ఈసారి బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ను అడిగారట. సారా.. సైఫ్ కు తన మొదటి భార్య అమృత సింగ్ కు పుట్టిన సంతానం. ఈ 24 ఏళ్ల చిన్నది ఈ సంవత్సరం కేధర్నాథ్ సినిమాతో అరంగేట్రం చేయబోతోంది. ఇందులో సుశాంత్ సింగ్ రాజపుట్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

ప్రభాస్ పేరు వినగానే చాలా ఆనందంగా స్క్రిప్ట్ వినడానికి రెడీ అయింది అంత సారా. స్క్రిప్ట్ బావుంది కానీ వల్ల అమ్మ అనుమతి తీస్కుంనమే ఏ విషయం చెప్తానని చెప్తోంది. ఆమె కోసం ప్రభాస్ కూడా ఎదురు చూస్తున్నాడు. అంత అనుకున్నట్టు జరిగితే సారా అతి త్వరలో ప్రభాస్ సరసన మన ముందుకు రావచ్చు.
Tags:    

Similar News