ఆమేనా ఈమె? అంటూ షాక్ తింటారు!

Update: 2020-06-01 04:30 GMT
నేను అప్పుడు ఇంత బ‌రువు ఉండేదానిని.. బొద్దుత‌నం త‌గ్గించుకునేందుకు ఎంతో శ్ర‌మించాను! అని చెప్ప‌డం కూడా ఒక ట్రెండే. కొంద‌రు సెల‌బ్రిటీ కిడ్స్ గ‌తాన్ని దాచేసేందుకు ప్ర‌య‌త్నించినా.. మ‌రికొంద‌రు మాత్రం అందుకు ఏమాత్రం బిడియ‌‌ప‌డ‌కుండా త‌మ అభిమానుల‌కు స్ఫూర్తి వంత‌మైన జ‌ర్నీకి సంబంధించిన చాలా విష‌యాల్ని లైవ్ లో చూపిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ వార‌సురాలు .. అందాల యువ‌నాయిక సారా అలీఖాన్ వెయిట్ లాస్ జ‌ర్నీకి సంబంధించిన వీడియో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సారా స్వ‌యంగా త‌న జ‌ర్నీ గురించి చెప్పుకొచ్చింది. చిన్న‌ప్పుడు ఎంతో బొద్దుగా ఉన్న సారా టీనేజీలో అడుగు పెట్టే క్ర‌మంలో ఎంతో శ్ర‌మించి బ‌రువు త‌గ్గించుకుని ఇప్పుడు వేడెక్కించే క‌థానాయిక‌గా వెలిగిపోతోంది బాలీవుడ్ లో. చిన్న‌ప్ప‌టి వీడియోలు చూసి ఇప్ప‌టి ఫిగ‌ర్ తో పోల్చుకుంటే అస‌లు పోలికే క‌నిపించ‌దు. ఆమేనా ఈమె? అంటూ క‌న్ఫ్యూజ్ అయిపోతారంతే..

సారా అలీ ఖాన్ ఇటీవల తన బరువును ఎలా కోల్పోతున్నారో చూపించే వీడియోను ఇటీవల పంచుకున్నారు. త‌ను లావుగా ఉన్న రోజుల నుండి కొన్ని పాత‌ క్లిప్ లతో వీడియోని చూపించింది. అటుపై కార్డియో వ్యాయామాలు- ఈత- బైక్ రైడ్ క్లిప్ లు ఆక‌ట్టుకున్నాయి. ఈ వీడియోలో తన సోదరుడు ఇబ్రహీంతో కలిసి ఉన్న‌వి ఉన్నాయి. న‌మ‌స్తే ద‌ర్శ‌కో.. లాక్ డౌన్ ఎడిష‌న్ అంటూ వీటిని షేర్ చేసింది. ఇక సారా షేర్ చేసిన వీడియోకు అభిమానులు ఫిదా అయిపోతూ.. మీలోని మార్పు చాలా న‌చ్చింది! అని పొగిడేస్తున్నారు.

ఇక సారా కెరీర్ సంగ‌తి చూస్తే ఇప్ప‌టికే సింబా చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకుంది. ప్ర‌స్తుతం వ‌రుస‌గా ప‌లు క్రేజీ ప్రాజెక్టుల‌లో న‌టిస్తూ బిజీగా ఉంది. 1995 బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం `కూలీ నంబర్ 1` రీమేక్‌లో వరుణ్ ధావన్ సరసన సారా కనిపించనుంది. ఈ కొత్త వెర్షన్ ‌కు డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించారు.
Tags:    

Similar News