ఒక్క ఫోటోకే సచిన్ కూతురిపై రూమర్స్

Update: 2017-04-06 13:57 GMT
సెలబ్రిటీలతో పాటు వారి పిల్లలు కూడా ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లో.. వివాదాల్లో నానడం సహజమే. కానీ లెజెండరీ క్రికెటర్ అయిన సచిన్ టెండూల్కర్ కానీ.. ఆయన కుటుంబీకులు కానీ ఎప్పుడూ ఏ రకమైన వివాదాల్లో కానీ.. రూమర్స్ కానీ వినిపించిన కనిపించిన దాఖలాలు ఉండవు. కానీ తాజాగా సచిన్ కూతురు సారా టెండూల్కర్ పై బోలెడంత హంగామా నడిచిపోతోంది.

ఈ 19 ఏళ్ల భామకు.. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో లింక్ చేస్తూ పెద్ద ఎత్తునే వార్తలు వచ్చేస్తున్నాయి. ఇంతకూ దీనికి కారణం ఏంటంటే.. ఇద్దరూ కలిసి సెల్ఫీ మాదిరిగా ఉన్న ఓ ఫోటోలో కనిపించడమే. రణవీర్ అంటే స్టార్ హీరో.. సారా టెండూల్కర్ అంటే సెలబ్రిటీ డాటర్.. సో వీరిద్దరు ఏదో ఒక పార్టీలో ఎక్కడో ఒకచోట తారసపడడం పెద్ద విషయమేమీ కాదు. ముంబైలో జరిగే వందలు.. వేల కొద్దీ పార్టీల్లో ఏదో ఒక పార్టీలో ఎదురయ్యి.. ఓ సెల్ఫీ తీసుకోవడంలో తప్పేమీ లేదు. సెలబ్రిటీ డాటర్ అయినంత మాత్రాన ఓ హీరోను అభిమానించ కూడదా ఏంటి?

అయినా అదేమీ పట్టించుకోకుండా ఒక ఫోటో పట్టుకుని రణవీర్ సింగ్ కి సారా టెండూల్కర్ కి రొమాన్స్ అనేయడం మాత్రం దారుణం అనే చెప్పాలి. షాహిద్ కపూర్ హీరోగా సారా హీరోయిన్ గా నటించనుందంటూ వార్తలు వస్తే సచిన్ స్వయంగా ఖండించాడు. ఇప్పుడు ఈ రూమర్ ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News