మంచి కాఫీలాంటి చిత్రాలను అందించే దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరీ’. నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమాలోని ‘సారంగ దరియా’ పాట తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. ఈ పాటకు సాయిపల్లవి డ్యాన్స్ తోడవడంతో.. యూట్యూబ్ లో నెవ్వర్ బిఫోర్ రికార్డులు నమోదు చేస్తూ దూసుకెళ్తోంది.
ఈ పాట ఫిబ్రవరి 28న సమంత చేతుల మీదుగా ఆన్ లైన్లో విడుదలైంది. ఆ మరుక్షణం నుంచే దూసుకెళ్లడం మొదలు పెట్టింది. అలా మొదలైన వ్యూయర్ షిప్.. అంతకంతకూ వేగంగా పెరుగుతూ టాలీవుడు రికార్డులను తిరగరాస్తోంది. కేవలం 14 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సత్తా చాటిన సారంగ దరియా.. ఇప్పుడు మరో మైల్ స్టోన్ ను చేరుకుంది.
ఇప్పటి వరకూ 90 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఈ పాట.. అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న మొదటి సాంగ్ గా రికార్డు సృష్టించింది. ఈ ఫీట్ తో చిత్ర బృందం హ్యాపీగా ఉంది. సుద్దాల అశోక్ తేజ సాహిత్యం.. మంగ్లీ గాత్రం.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ.. సాయిపల్లవి డ్యాన్స్.. ఈ నలుగురి కాంబోలో వచ్చిన ఈ సాంగ్.. యూట్యూబ్ ను దున్నేస్తోంది.
శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి పవన్ సి.హెచ్. సంగీతం అందించారు. ఏప్రిల్ 16న ఈ సినిమా విడుదల కాబోతోంది.