సీనియర్ హీరో మాట: నాకు 25 మంది పిల్లలు

Update: 2017-02-23 10:01 GMT
సీనియర్ హీరో శరత్ బాబు చూడ్డానికి చాలా ప్రశాంతంగా.. వివాద రహితుడిలా కనిపిస్తాడు. కానీ ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పెద్ద కాంట్రవర్శీలున్నాయి. ఆయన ఒకటికి రెండు పెళ్లిళ్లు చేసుకుని.. ఇద్దరికీ విడాకులు ఇచ్చారు. ఆ ఇద్దరూ కూడా ఆయన నుంచి విడిపోయాక తీవ్ర ఆరోపణలు చేశారు. తనకంటే వయసులో పెద్ద అయిన సీనియర్ నటి రమాప్రభను శరత్ బాబు మొదట వివాహం చేసుకున్నాడు. తన ఆస్తినంతా తన పేర రాయించుకుని తనను అనాథగా వదిలేశాడని రమాప్రభ ఆరోపిస్తే.. శరత్ రెండో భార్య స్నేహలతా దీక్షిత్ కూడా ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసింది. శరత్ టార్చర్ భరించలేకే విడిపోయినట్లు తెలిపింది. ఇద్దరితో విడిపోయాక శరత్ మూడో పెళ్లి కూడా చేసుకోవడం గమనార్హం. ఐతే ఆ పెళ్లి గురించి... తన భార్య గురించి వివరాలు బయటికి పొక్కనివ్వలేదాయన.

కాగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మీ భార్య పేరేంటి అని అడిగితే.. చెప్పడానికి నిరాకరించారు శరత్ బాబు. భార్య పేరు అడిగితే ఆయనిచ్చిన సమాధానం.. ‘‘మిసెస్ శరత్ బాబు’’ అంతకు మించి ఒక్క మాట మాట్లాడలేదు. మీ గత వివాహాలు.. విడాకుల మాటేంటి అని అడిగితే.. వాళ్ల పేర్లు ఉచ్చరించడానికి కూడా తనకిష్టం లేదని ఆయన తేల్చేశారు. ‘‘జీవితం ఒక ప్రయాణం. జీవితంలో జరిగే ఎన్నో సంఘటనల్లో పెళ్ళి కూడా ఒక సంఘటనే. కొన్ని జీవితకాలం ఉంటాయి. మరికొన్ని కాలం తీరిపోయినవి కాలగర్భంలో కలిసిపోతాయి. జీవితంలో ఏం జరిగినా మన మంచికే’’ అంటూ వేదాంతం వల్లించారు శరత్. ఇంతకీ మీకెందరు పిల్లలు అని అడిగితే.. పాతికమంది అని శరత్ బాబు జవాబివ్వడం విశేషం. సీరియస్ గా చెప్పండి అంటే... ‘‘సీరియస్ గానే చెబుతున్నా. నాకు పాతికమంది పిల్లలు. మా అన్నదమ్ములు.. అక్కాచెల్లెళ్ల పిల్లలు అందరూ కూడా నా పిల్లలే. నేను షూటింగులకు వెళ్లినప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు. మీకు ఎంతమంది పిల్లలని.. ఠక్కున చెబుతాను.. పాతికమందని’’ అని శరత్ బాబు అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News