చిన్న రచయితలకు అన్యాయం చేస్తున్నారు

Update: 2016-02-27 05:35 GMT
చిన్న రచయితలకు అన్యాయం చేస్తున్నారు
మహేష్ బాబు శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ గా నిలిచినా.. ఇప్పుడు వివాదంలో చిక్కుకుపోయింది. తన స్టోరీని కొట్టేశారంటూ కోర్టులో కేసు వేసిన రచయిత శరత్ చంద్ర.. తెలుగు సినిమా రచయితల సంఘానికి కూడా ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు శ్రీమంతుడు సినిమాకి, శరత్ చంద్ర నవలకు దగ్గరి పోలికలు ఉన్నాయని రైటర్స్ అసోసియేషన్ అంగీకరించని.. ఆ రచయిత చెబుతున్నాడు.

'కొరటాల శివ నా నవలను కాపీ కొట్టి శ్రీమంతుడు తీశాడని తేలిపోయింది. నేను రచయితల సంఘం ఇచ్చే రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నాను' అని చెప్పిన శరత్ చంద్ర.. చిన్న రచయితలు అన్యాయానికి గురవుతున్న తీరును ఎండగట్టాడు. ఇండస్ట్రీకి కొత్త కథలు చాలా అవసరమని, అయితే చాలామంది చిన్న రచయితలను మోసం చేసి ఇలా వారికి అన్యాయం చేస్తున్నారని అన్నాడు ఈ రైటర్. తాను వారందరి తరఫున ఇలా పోరాటం చేస్తున్నట్లు వివరించాడు.

'నా నవల ఆధారంగా తీసిన శ్రీమంతుడు పెద్ద హిట్ అయింది కాబట్టి నాకు తగిన నష్టపరిహారం చెల్లించాలి. అలాగే హిందీ వెర్షన్ కి రచయితగా నా పేరును వేయాలి. అంతేకాదు కొరటాల శివ తన తప్పును అంగీకరించి, ఆ స్టోరీ క్రెడిట్ నాకు ఇవ్వాల్సిందే'.. ఇవీ శరత్ చంద్ర డిమాండ్స్. వెలిగొండ ప్రాజెక్ట్ సమయంలో జరిగిన ఓ యదార్ధ గాధ ఆధారంగా ఈ నవల రాసినట్లు చెప్పాడాయన. శరత్ చంద్ర అనేది ఈ రచయిత కలం పేరు కాగా.. ఆర్.డి. విల్సన్ అసలు పేరు. గతంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి మైనారిటీ బోర్డ్ ఛైర్మన్ గా కూడా వ్యవహరించాడీయన.

Tags:    

Similar News