యాపిల్ బ్యూటీస్ మధ్య నల్లనయ్య

Update: 2018-05-03 01:30 GMT
 సెలెబ్రిటీలు చేసే బ్రాండ్ ఎండార్స్ మెంట్ కు అర్థాలు మారుతున్నాయి. ఒకప్పుడు సినిమా తారలు చెబితేనే వస్తువులు కొనే ట్రెండ్ నుంచి ఆయా వ్యాపారాలు ఎవరివో ఆ యజమానులే స్వయంగా తమ ప్రకటనల్లో నటించడం అనే పోకడను ఈ మధ్య బాగా గమనిస్తున్నాం. లలిత జ్యువెలర్స్ ని దీనికి మంచి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే దారిలో మరొక బిజినెస్ మెన్ కూడా ఉన్నాడు. అతని పేరే శరవణ ఆరుళ్. తమిళనాడులో సుప్రసిద్ధి చెందిన శరవణ స్టోర్స్ యజమానుల్లో రెండో తరం మొదటి వారసుడు. ఇతని యాడ్స్ తమిళనాట మహా పాపులర్. ఇంత నల్లగా ఉంటాడు అదే పనిగా శరవణను ఎవరు చూస్తారా అనుకోకండి. అతనికీ ఆ డౌటే వచ్చి ఏకంగా ఇద్దరు స్టార్ ముద్దుగుమ్మలను తనతో పాటు యాడ్ లో నటించేందుకు ఒప్పించాడు. ఒకరు మిల్కీ బ్యూటీ తమన్నా అయితే మరొకరు యాపిల్ స్వీటీ హన్సిక మోత్వాని. ఇంకేముంది రకరకాల యాడ్స్ తో ఇద్దరితో రచ్చ రచ్చ చేస్తున్న శరవణ వైభవం చూసేందుకు రెండు కళ్ళు చాలవు అనుకోండి.

మామూలుగానే వ్యాపార ప్రకటనలకు భారీగా వసూలు చేసే ఈ ఇద్దరు టాప్ అందగత్తెలు శరవణ పక్కన నటించడానికి తొలుత సంశయించినా ఏకంగా ఒక సినిమాకు ఇచ్చేంత రెమ్యునరేషన్ ఆఫర్ చేయటంతో కాదనలేక ఒప్పుకున్నట్టు కోలీవుడ్ టాక్. వీళ్ళనే శరవణ ఆరుళ్ తన యాడ్స్ లో నటింపజేసి హీరో లెవెల్ లో బిల్డప్ ఇస్తుంటాడు. శరవణ ఆరుళ్ విలాస ప్రియుడు. అతను పర్సనల్ గా వాడే కార్ల ఖరీదే పాతిక కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. పెళ్ళైన కూతురు ఉన్న ఆరుళ్ ఇటీవలే తన పెళ్లి జరిపించినప్పుడు కేవలం వెడ్డింగ్ గౌన్ కోసమే 14 కోట్లు ఖర్చు పెట్టడం విని నోరెళ్ళబెట్టని వారు లేరు. చాలా ఆడంబరంగా ఉండే శరవణ ఆరుళ్ చెన్నైలో ఎక్కడ ఉన్నా తన ఉనికి అక్కడ ఉండేలా చూసుకుంటాడు. ఆ రేంజ్ లో అతని బిల్డప్ ఉంటుంది. అంతే కాదు కూతురి వివాహ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్క అతిధి మీద పది వేల రూపాయల ఖర్చు పెట్టాడు అంటే సామాన్యమా. శరవణ సంస్థను స్థాపించింది సెల్వరత్నం. ఇతని కొడుకే శరవణ ఆరుళ్. సెల్వరత్నం తమ్ముడు రాజరత్నం ఆధ్వర్యంలో మొత్తం గ్రూప్ నడుస్తోంది. తన తండ్రి తర్వాత శరవణ ఆరుళ్ ఇందులో కీలక బాధ్యతలు నడిస్తున్నాడు. మొత్తానికి రాజు గారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అనే రేంజ్ లో ఉన్న శరవణ ఆరుళ్ గురించి చెప్పాలంటే ఈ స్పేస్ ఎంత మాత్రం సరిపోదు. మనోడి హిస్టరీ అంత ఉంది మరి.
Tags:    

Similar News