శరవణన్ స్టోర్స్ అధినేత, లెజెండ్ శరవణన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ''ది లెజెండ్''. ఇందులో ఊర్వశి రౌటేలా హీరోయిన్ గా నటించింది. స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది.
'ది లెజెండ్' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే తమన్నా భాటియా తో తెలుగు ట్రైలర్ ను లాంచ్ చేయించి, ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ క్రమంలో లేటెస్టుగా సినిమాలోని ఓ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.
'మొసలో మొసలి మింగుతున్న స్టైలే.. విజిలో విజిల్ మారుమోగు చెవులే..' అంటూ సాగిన ఈ పాటని స్పెషల్ సెట్ లో గ్రాండ్ గా చిత్రీకరించారు. దీని కోసం బాగానే ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో శరవణన్ తో పాటుగా అందాల ఊర్వశీ ఆడిపడింది. మన లెజండ్ కు డ్యాన్స్ రాకపోయినా సింపుల్ స్టెప్పులతో మేనేజ్ చేశాడని స్పష్టంగా అర్థం అవుతోంది. కాకపోతే అందుకోసం బాగానే కష్టపడినట్లు తెలుస్తోంది.
కొరియోగ్రాఫర్ రాజు సుందరం స్క్రీన్ నిండా డ్యాన్సర్స్ ప్రాపర్టీస్ తో.. శరవణన్ కదలికల మీద కంటే సాంగ్ సెటప్ మీద ఫోకస్ పెట్టారు. లెజెండ్ కంటే ఊర్వశీ స్టెప్పులను హైలైట్ చేసి చూపించారు. ఈ పాటలో ఊర్వశి ఎప్పటిలాగే అందంగా కనిపించింది. సినిమాటోగ్రాఫర్ వేల్ రాజా సైతం తన కెమెరా జమ్మిక్కులతో మ్యానేజ్ చేసే ప్రయత్నం చేశారు.
మొత్తం మీద సూపర్ సీనియర్ హీరోల సినిమాల్లో డ్యూయెట్ సాంగ్స్ ఎలా డిజైన్ చేస్తారో.. అదే విధంగా లెజెండ్ కోసం ఈ పాటని షూట్ చేశారు. మరి థియేటర్లలో లెజెండ్ స్టెప్పులకు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
హారిస్ జైరాజ్ ఈ డ్యాన్స్ నంబర్ కు ట్యూన్ కంపోజ్ చేయగా.. లిరిసిస్ట్ రాకేందు మౌళి దానికి తగ్గట్టుగా తెలుగు లిరిక్స్ ఇరికించే ప్రయత్నం చేశారు. సంతోష్ హరిహరన్ ఈ పాటను పాడారు.
'ది లెజెండ్' చిత్రాన్ని ఈ నెల 28న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జేడీ - జెర్రీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని న్యూ లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ పై శరవణన్ నిర్మించారు. తెలుగులో శ్రీ లక్ష్మీ మూవీస్ పతాకంపై తిరుపతి ప్రసాద్ ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.
విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకున్న ఓ సైంటిస్ట్.. మాతృభూమిపై ప్రేమతో తన ప్రజలకు సేవ చేయాలని ఇండియాకి తిరిగిచ్చిన తర్వాత ఏం జరిగింది.. అతనికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనేది 'ది లెజెండ్' సినిమాలో చూపించనున్నారు.
Full View

యాక్షన్, రొమాన్స్, కామెడీ.. ఇలా అన్ని కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నటులు సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేశారు. గీతిక - సుమన్ - ప్రభు - నాజర్ - విజయ్ కుమార్ - వివేక్ - లత - కోవైసరళ - యోగిబాబు తదితరులు కీలక పాత్రలో నటించారు. డెబ్యూ మూవీతోనే పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని కోట్లు కుమ్మరించిన లెజెండ్.. ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.