మరి రెండు పాటలను యాడ్ చేయకుండానే సినిమాను ఎలా సెన్సార్ చేస్తారో తెలియదు కాని.. ఇప్పుడు మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ''సర్దార్ గబ్బర్ సింగ్'' సినిమా పెను సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసేసింది.
అవును.. ఈ రోజు ఉదయం సినిమాను చూసిన సెన్సార్ బోర్డు వారు.. సర్దార్ సినిమాకు ''యు/ఎ'' సర్టిఫికేట్ చేతిలో పెట్టారు. ఒకవేళ తాము చెప్పిన కట్స్ చేస్తే సినిమాకు 'యు' సర్టిఫికేట్ ఇస్తామన్నారట. అయితే యాక్షన్ ఎపిసోడ్లు కట్ చేస్తే బాగోదు అని నిర్మాతలు ఫీలవ్వడంతో.. సినిమాకు యు/ఎ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క కట్ కూడా లేకుండా తాము చూపిన సినిమాను యాజిటీజ్ సెన్సార్ చేయించి తెచ్చుకున్నారు సర్దార్ వీరులు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ రేపు స్విట్జర్ ల్యాండ్ నుండి తిరిగొచ్చాక.. తక్కిన రెండు పాటలను కూడా విడిగా సెన్సార్ చేయించి.. సినిమాలో మిక్స్ చేస్తారట. ఏప్రియల్ 8న ప్రపంచవ్యాప్తంగా తెలుగు - హిందీ బాషల్లో సెన్సార్ రిలీజవుతోంది.