సర్దార్ ఫిగర్స్ చూస్తే కళ్లు తిరుగుతాయ్

Update: 2016-02-01 11:30 GMT
ఇంకో రిలీజ్ డేట్ ఫిక్సవలేదు. మూణ్నాలుగు నెలల తర్వాత కానీ సినిమా విడుదలయ్యే అవకాశం లేదు. పైగా ఇది మూడేళ్ల కిందట మొదలైన ప్రాజెక్టు. అనేక అవాంతరాల్ని దాటుకుని కొన్ని నెలల కిందటే మొదలైంది. షూటింగ్ కూడా అనుకున్న ప్రకారం జరగకుండా ముందుకు వెనక్కి నడుస్తోంది. ఐతేనేం అది పవన్ కళ్యాణ్ సినిమా. ఈ ఒక్క రీజన్ చాలదూ బయ్యర్లు ఎగబడిపోవడానికి. విడుదలకు చాలా నెలల ముందే ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అయిపోయినట్లు ఈ మధ్యే సమాచారం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయా ఏరియాల ఫిగర్స్ కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అవి చూస్తే టాలీవుడ్ ట్రేడ్ పండిట్స్ కళ్లు తిరగడం ఖాయం.

బాహుబలిని పక్కనబెట్టేస్తే.. వైజాగ్ ఏరియాకు ఎంత పెద్ద సినిమా అయినా రూ.5 కోట్లకు మించి పలకదు. అలాంటిది ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రేటు ఏకంగా రూ.7.2 కోట్లు పలకడం విశేషం. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల లెక్కలు కూడా బయటికి వచ్చాయి. ఆ మూడు జిల్లాల్లోనూ అనూహ్యమైన రేటు పలికింది పవన్ మూవీ. గుంటూరు జిల్లాకు ఏకంగా రూ.6.5 కోట్లు పెట్టేశాడట బయ్యర్. ఒక్క జిల్లాకు ఈ రేంజిలో రేటంటే అనూహ్యమే. కృష్ణా జిల్లాకు రూ.4.25 కోట్లకు, నెల్లూరు జిల్లాకు రూ.3.25 కోట్లకు హక్కులు అమ్మారు. ఇవి సెన్సేషన్ ఫిగర్స్. నెల్లూరు లాంటి చిన్న సెంటర్లోనూ రూ.3 కోట్లకు పైగా రేటు పలకడమంటే మాటలు కాదు. పవన్ పవర్ ఏంటనడానికి ఈ ఫిగర్లే నిదర్శనం.

Tags:    

Similar News