టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న తమిళ హీరోలలో కార్తీ ఒకరు. 'యుగానికొక్కడు' నుంచి తాను నటించే ప్రతీ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తూ.. ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు. ఇటీవల 'పొన్నియిన్ సెల్వన్-1' చిత్రంతో అలరించిన కార్తీ.. ఇప్పుడు ''సర్దార్'' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
'అభిమన్యుడు' ఫేమ్ పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ''సర్దార్''. ఇందులో రాశీఖన్నా - రజీషా విజయన్ లు హీరోయిన్లుగా నటించారు. దీపావళి కానుకగా రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
ఇప్పటికే విడుదలైన 'సర్దార్' టీజర్ సినిమాపై అంచనాలు కలిగించింది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. ఇందులో కార్తీ ని ఒక భారతీయ గూఢచారిగా.. డిఫరెంట్ గెటప్స్ లో చూపిస్తూ ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
'సర్దార్ ను పట్టుకోవడం అంత ఈజీ కాదు.. అతను మారువేషాల్లో మాస్టర్' అని కార్తీ పాత్రకి ఎలివేషన్ ఇవ్వడంతో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. నలుగురికి మంచి చేసినా నలభై వేల మందికి తెలియాలి అనుకునే పోలీసాఫీసర్ గా కార్తీ ని చూపించారు. ఆ తర్వాత భిన్నమైన గెటప్స్ లో కనిపించి ఆశ్చర్య పరిచాడు. ఓవైపు యంగ్ లుక్ లో కనిపిస్తూనే మరోవైపు ముసలి స్పైగా ఆకట్టుకున్నాడు.
ఇండియన్ మిలటరీ ఇంటిలిజెన్స్ నేపథ్యంలో 'సర్దార్' సినిమా రూపొందినట్టు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. మిలిటరీ రహస్యాలు దాగి ఉన్న ఓ ఫైల్ మిస్ అవ్వగా.. దాని కోసం కార్తీ ప్రయత్నాలు సాగిస్తున్నాడు. అయితే తనకంటూ ఓ గుర్తింపు లేకుండా పోయిందని బాధ పడే అతని ఓ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఒక్కసారి స్పైగా మారితే ఎల్లప్పుడూ.. గూఢచారిగానే ఉండిపోవాలని చెప్పడం ఈ సినిమా పాయింట్ ని తెలియజేస్తోంది. ఇందులో రాశీఖన్నా - రజీషా విజయన్ ఇద్దరితోనూ కార్తీ లవ్ ట్రాక్ ని చూపించారు. ఇందులో నిన్నటి తరం హీరోయిన్ లైలా కీలక పాత్రలో కనిపించింది. అలానే చుంకీ పాండే - ప్రిన్స్ - మునీశ్ కాంత్ - మురళీ శర్మ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
సర్దార్ ఎవరు? అతను మారువేశాల్లో తిరగడానికి. రకరకాల గెటప్స్ లో కనిపించటానికి కారణమేంటి? అనేది తెలియాలంటే 'సర్దార్' సినిమా చూడాల్సిందే. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు జార్జ్ విలియమ్స్ విజువల్స్ ఈ ట్రైలర్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
'సర్దార్' చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఈ స్పై థ్రిల్లర్ తెలుగు వెర్షన్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కింగ్ అక్కినేని నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 21న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కాబోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.