సంక్రాంతి హీరోల పోటీ ఎన్నడూ లేని విధంగా తారాస్థాయిలో ఉంది. మూడు నెలల క్రితం ప్రచార కార్యక్రమాలతో మొదలైన ఈ పోటీ ఇప్పుడు కలెక్షన్స్ నంబర్స్ ప్రచారం వరకూ కొనసాగుతోంది. ఒకరు సంక్రాంతి విన్నర్ నేనే అంటుంటే మరొకరు సంక్రాంతి మొగుడు నేనే అంటున్నారు. ఇవన్నీ తేలాలంటే పెట్టుబడి వెనక్కు రావాలి.. అందరికీ లాభాలు రావాలి. ఈ సినిమాలపై పెట్టుబడి పెట్టిన వారందరూ సేఫ్ జోన్ లోకి రానంతవరకూ ఎవరూ 'మొగుడు' కాదు 'విన్నర్' అంతకన్నా కాదు.
ఈ సినిమాలు రెండు భారీ బడ్జెట్ సినిమాలే. అందుకే మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు దాదాపుగా లేవు. బాహుబలి లాంటి ప్రత్యేకమైన సినిమాలకు తప్ప మొదటి వారంలోనే 100 కోట్లు తీసుకొచ్చే స్థాయి ఇంకా తెలుగు సినిమాలకు రాలేదు. కనీసం మరో వారం గడిస్తే కానీ బ్రేక్ ఈవెన్ అయిందా లేదా.. ఎవరికి లాభం వచ్చింది ఎవరికి నష్టం వచ్చింది అనేవి తెలియదు. అయితే పోటీ ఎక్కువ కావడంతో రెండు సినిమాలకు సంబంధించిన వారు కలెక్షన్ ఫిగర్లను పెంచి ప్రచారంలోకి తీసుకొస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా ప్రచారంలోకి వచ్చిన కలెక్షన్స్ ను పరిశీలిస్తే 'అల వైకుంఠపురములో' సినిమా నైజామ్.. వైజాగ్.. కృష్ణ.. ఈస్ట్.. వెస్ట్.. సీడెడ్.. నెల్లూరు.. గుంటూరు లో నాలుగు రోజుల కలెక్షన్లతో నాన్ - బాహుబలి 2 రికార్డ్ సృష్టించిందని అంటున్నారు. 7 టెరిటరీలలో నాన్ బాహుబలి రికార్డ్ అని అంటున్నారు. మరోవైపు 'సరిలేరు నీకెవ్వరు' 5 రోజుల కలెక్షన్స్ లో ఇలాంటి రికార్డులే ఉన్నాయని అంటున్నారు. నైజామ్.. ఈస్ట్.. నెల్లూరు నాన్ బాహుబలి 2 రికార్డ్ అని.. వెస్ట్ లో ఆల్ టైమ్ రికార్డ్ అని.. ఈస్ట్.. గుంటూరు.. వైజాగ్ లో బ్రేక్ ఈవెన్ అయిందని అంటున్నారు.
అసలే ఇది డిజిటల్ యుగం. ఎవరూ ఎవరినీ నమ్మరు. నిజం చెప్తుంటేనే నమ్మే పరిస్థితులు లేవు. అలాంటిది రెండు సినిమాలు ఒకే సమయంలో మాది నాన్ బాహుబలి 2 రికార్డు.. మాది నాన్ - బాహుబలి 2 రికార్డు అని క్లెయిమ్ చేసుకుంటే ఎలా నమ్ముతారు. ఒక సమయంలో రెండు సినిమాలకు సేమ్ రికార్డు ఎలా ఉంటుంది? ఇది కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఎవరికైనా మనసులో తలెత్తే ప్రశ్నలు.
ఈ లెక్కన 'రంగస్థలం' రికార్డులు అన్నీ తుడిచిపెట్టుకుపోయినట్టేనా? ఈ సినిమాలు రిలీజై సరిగ్గా వారం కూడా కాలేదు ఇప్పుడే బ్రేక్ ఈవెన్. నాన్- బాహుబలి 2 రికార్డులు అని క్లెయిమ్ చేసుకుంటే ఫుల్ రన్ లో అవతార్.. ఆవెంజర్ ఎండ్ గేమ్ ప్రపంచ రికార్డులకు ఎసరు పెడతారేమో అని ఇండస్ట్రీలో స్ట్రాంగ్ సెటైర్లు వేస్తున్నారు. అయినా ఈ షాకింగ్.. షేకింగ్ ఫిగర్లను బయటకు వదిలేముందు కాస్త ముందు వెనక ఆలోచించాలని కోరుతున్నారు. మరీ పోటీ ఇలా దిగజారకుండా ప్రొడ్యూసర్స్ గిల్డ్ చొరవ తీసుకుని ఈ కలెక్షన్ల ప్రచారానికి అడ్డుకట్ట వెయ్యాలని కూడా కోరుతున్నారు.