సంక్రాంతి కానుకగా రిలీజైన `సరిలేరు నీకెవ్వరు`...`అల వైకుంఠపురములో` చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చక్కని ఓపెనింగులు సాధించాయి. లాంగ్ రన్ లో ఆధిపత్యం కోసం ఒకరితో ఒకరు పోటీపడుతూ కలెక్షన్స్ రిపోర్టుల్ని రివీల్ చేస్తున్నారు. మా వసూళ్లు ఇంత రేంజు అంత రేంజు అంటూ పోస్టర్లు వేస్తున్నారు. వసూళ్ల మాటేమో గానీ.. రెండు అగ్ర హీరోల సినిమాలు ఒక రోజు గ్యాప్ లో రిలీజ్ అవ్వడం మాత్రం రెండు సినిమాలకు పెద్ద దెబ్బేనన్న విశ్లేషణ సాగుతోంది. వసూళ్ల వివరం అధికారికంగా చెబుతున్నా జనం నమ్మలేని పరిస్థితి. ఆరంభమే కొంత క్లారిటీ లోపించడంతో చెబుతున్న లెక్కల విషయంలో గందరగోళం నెలకొంది. ఏరియా వైజ్ లెక్కల్లో క్లారిటీ లేదు. ఇక బాక్సాఫీస్ వద్ద అల వైకుంఠపురములో డామినేషన్ సాగుతోందన్న దానికి కొన్ని ఆధారాలున్నాయి.
ఆ విషయం పక్కనబెడితే సరిలేరు రిలీజై వారం పూర్తవ్వగా...అల వైకుంఠపురములో వారానికి చేరువైంది. అయితే ఈ రెండు సినిమాల్లో ఏదైనా నాన్ బాహుబలి రికార్డులను తుడిచేయగలదా? రంగస్థలం రికార్డులను కొల్లగొట్టగలదా? అంటే చాలా ప్రశ్నలే ఉత్పన్నం అవుతున్నాయి. మరో రెండు రోజులు రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఇదే దూకుడు చూపించగలిగితే రంగస్థలం సహా..నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసే ఛాన్సుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే వారం తర్వాత ఈ దూకుడు సాధ్యమయ్యే పని కాదు.
రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయిన నేపథ్యంలో థియేటర్లు డివైడ్ అయ్యాయి. రెండు సినిమాల వసూళ్లలో తగ్గుముఖం కనిపించనుంది. సరిలేరు ఇప్పటికే వార్తం పూర్తి చేసుకుంది కాబట్టి థియేటర్లో టిక్కెట్లు రేట్లు తగ్గిపోతాయి. అసలు ధరకు టిక్కెట్ అమ్మాల్సి ఉంటుంది. సినిమాపై కొంత డివైడ్ టాక్ కూడా ఉంది కాబట్టి ఈ ఫీట్ సాధించడం అంత ఈజీ కాదన్న వాదన ఉంది. ఇక అల వైకుంఠపురముకి మరో ఒకటి రోజుల్లో అదే పరిస్థితి ఎదురు కానుంది. సరిలేరు కన్నా అలకు రివ్యూలు పాజిటివ్ గా ఉన్నా! ఈ సవాళ్లను అన్నింటిని అధిగమించగలదా? అన్న సందేహం వెంటాడుతోంది. మరి ఈ వార్ లో కనీసం బాక్సాఫీస్ వద్ద సిసలైన ఫలితం ఏదో తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. అయితే ఇప్పటికే స్కూళ్లు తెరిచేస్తున్నారు కాబట్టి పండగ మూడ్ నుంచి బయటపడిపోతున్న జనం ఇక థియేటర్లకు వచ్చేంత సీన్ ఉండదేమో!