సరిలేరు.. అల.. బ్యాండ్ ఎవ్వరికో?

Update: 2020-01-06 01:30 GMT
సంక్రాంతికి ప్రతి ఏడాదీ మూడు నాలుగు సినిమాలొస్తుంటాయి. అందులో రెండు మూడైనా భారీ చిత్రాలుంటాయి. ఐతే మిగతా సీజన్లతో పోలిస్తే సంక్రాంతి సీజన్లో వసూళ్లు ఎక్కువుంటాయి. లాంగ్ రన్ కూడా ఉంటుంది. అందుకే ఈ సీజన్లో సినిమాలు రిలీజ్ చేయడానికి అంతగా తహతహలాడుతుంటారు. కానీ అదే సమయంలో సంక్రాంతి సీజన్ విషయంలో పెద్ద రిస్క్ కూడా ఉంది. మూణ్నాలుగు సినిమాలు రేసులో ఉంటాయి కాబట్టి.. ఏదైనా సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే అంతే సంగతులు. ప్రేక్షకులకు వేరే ఛాయిస్ ఉంటుంది కాబట్టి బ్యాడ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు బ్యాండ్ పడిపోతుంటుంది. గత ఏడాది మరీ అంచనాలేమీ లేకుండా వచ్చిన ‘ఎఫ్-2’ ఎలా ఇరగాడేసిందో తెలిసిందే. దీని దెబ్బకు ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ - ‘వినయ విధేయ రామ’ సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి. అంతకుముందు ఏడాది ‘అజ్ఞాతవాసి’ పరిస్థితి ఏమైందో కూడా తెలిసిందే. ‘జై సింహా’ లాంటి యావరేజ్ మూవీ దీన్ని దెబ్బ కొట్టింది.

కాబట్టి సంక్రాంతి సీజన్ సంక్రాంతి సీజన్ అని ఎగిరెగిరి పడాల్సిన పని కూడా లేదు. ఇక్కడ అడ్వాంటేజ్‌తో పాటు డేంజర్ కూడా ఉంటుంది. ఈ ఏడాది ‘సరిలేరు నీక్వెవరు’, ‘అల వైకుంఠపురములో’ లాంటి భారీ చిత్రాలు సంక్రాంతి రేసులో నిలిచాయి. వీటికి ముందు వెనుక రానున్న ‘దర్బార్’ - ‘ఎంత మంచివాడవురా’ సినిమాల మీద పెట్టుబడులు తక్కువే. వాళ్లకు మరీ అంత రిస్క్ ఏమీ లేదు. రిస్క్ అంతే మహేష్ - బన్నీ సినిమాలకే. వాటి మీద బయ్యర్లు ఆ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారు. సోలో రిలీజ్ ఉన్నపుడు ఎంతైతే పెట్టుబడి పెడతారో.. ఇప్పుడూ అంతే పెడుతున్నారు. ఈ నేపథ్యంలో టాక్ ఏమైనా తేడా వచ్చి.. రేసులో ఉన్న మరో సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే అంతే సంగతులు. ప్రేక్షకులంతా అటు వైపు పోలరైజ్ అవుతారు. నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు మామూలుగా ఉండదు బ్యాాండ్. అలా కాకుండా రెండు సినిమాలకూ పాజిటివ్ టాక్ వస్తే పర్వాలేదు. కానీ ఈ రెంటిలో ఏదైనా చిత్రానికి బ్యాడ్ టాక్ వచ్చి ఇంకోటి పాజిటివ్‌ టాక్ తెచ్చుకుందంటే మాత్రం దెబ్బ మామూలుగా ఉండదు.


Tags:    

Similar News