సరిలేరు టైటిల్ సాంగ్: ఇంటెన్స్ గా ఉందే

Update: 2019-12-23 13:35 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' నుంచి ఇప్పటివరకూ మూడు పాటలు విడుదలయ్యాయి.  ప్రతి సోమవారం సాయంత్రం ఒక పాటను రిలీజ్ చేస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ ఈరోజు నాలుగవ సింగిల్.. టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.  'సరిలేరు నీకెవ్వరు' సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఈ పాటకు స్వయంగా సాహిత్యం అందించడం విశేషం.

ఈ పాటను శంకర్ మహదేవన్ పాడారు. "భగభగభగ మండే నిప్పుల వర్షమొచ్చినా.. జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు.. ఫెళ ఫెళ మంటూ మంచు తుఫాను వచ్చినా వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు.. దడదడమంటూ తూటాలే దూసుకొచ్చినా తన గుండెను అడ్డుపెట్టి ఆపెవాడే సైనికుడు.." అంటూ ఫైనల్ గా సరిలేరు నీకెవ్వరు అనే హుక్ లైన్ వస్తుంది.  సైనికుల గొప్పదనం తెలిపేలా.. వారి ధైర్యం.. త్యాగం ప్రతిఫలించేలా దేవీ ఈ పాటకు మంచి సాహిత్యం అందించారు.  ఇక ట్యూన్ కూడా ఇంటెన్స్ గా ఉంది. మొదటి మూడు పాటలతో పోలిస్తే ఇదే బెస్ట్ ట్యూన్ అనుకోవచ్చు.  ఈ పాటను తనదైన శైలిలో శంకర్ మహదేవన్ అద్భుతంగా పాడారు.  సైనికులకు ఒక నివాళి అన్నట్టుగా సాగే ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాన్ని తడుముతుంది అనడంలో సందేహం లేదు.

అయితే రెగ్యులర్ మాస్ పాటల మెలోడీస్ తో మాత్రం దీన్ని పోల్చలేం. ఇది సరిలేరు ఆల్బంలో ఒక ప్రత్యేకమైన పాటగా నిలిచిపోతుంది.  వ్యూస్ లెక్కలు ఎలా ఉంటాయో దేవుడెరుగు కానీ సరిలేరు ఆల్బం నుంచి వచ్చిన మంచి పాట ఇది.  ఆలస్యం ఎందుకు.. వినేయండి. మధ్యలోఆర్మీ ఆఫీసర్ గా ఇంటెన్స్ గా ఉన్న మహేష్ ను కూడా చూసేయండి.

Full View



Tags:    

Similar News