సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ జంటగా రూపొందుతున్న సినిమా సర్కారు వారి పాట్. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. సినిమా షూటింగ్ దశలో ఉండగానే పలు ఏరియాలకు బిజినెస్ అవుతోంది. తాజాగా ఈ సినిమా యూఎస్ లో భారీ మొత్తానికి అమ్ముడు పోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏకంగా 15 కోట్ల రూపాయలకు ఈ సినిమా ను కొనుగోలు చేసిందనే సమాచారం అందుతోంది. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో ఈ డీల్ ను అధికారికంగా ఫైనల్ చేయడానికి సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
సర్కారు వారి పాట సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన గీత గోవిందం తర్వాత చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా లో మహేష్ బాబు లుక్ అభిమానులకు ఇప్పటికే మెప్పించింది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను బ్యాంకింగ్ రంగంలో ఉన్న అవినీతి మరియు ఇతర విషయాలను గురించి ప్రస్థావిస్తూ తెరకెక్కించడం జరిగింది. బ్యాంకింగ్ రంగంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించినట్లుగా తెలుస్తోంది. సంక్రాంతికి ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా ఉన్న నేపథ్యంలో సమ్మర్ కు ఈ సినిమా ను వాయిదా వేసినట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
మహేష్ బాబుకు నార్మల్ గానే యూఎస్ లో భారీ ఎత్తున మార్కెట్ ఉంది. ప్లాప్ అయినా కూడా మహేష్ బాబు సినిమాలు అక్కడ మంచి వసూళ్లు దక్కించుకుంటున్నాయి. కనుక ఈ సినిమా కు భారీ ఎత్తున అంచనాలున్న నేపథ్యంలో ఓవర్సీస్ లో భారీగా వసూళ్లను దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకే భారీ మొత్తంలో ఈ సినిమా అక్కడ బిజినెస్ అయినట్లుగా తెలుస్తోంది. యూఎస్ లో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడం ద్వారా మహేష్ గత రికార్డులను బ్రేక్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే ఇతర ఏరియాల బిజినెస్ కూడా జరిగే అవకాశం ఉందంటున్నారు.