సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురాం పెట్లా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “సర్కారు వారి పాట”. మే 12న విడుదలైన ఈ చిత్రం.. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.
SVP మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మూడు వారాల్లోనే పే పర్ వ్యూ విధానంలో ఓటీటీలోకి వచ్చింది. అయితే ఇప్పుడు సాధారణ సబ్ స్క్రైబర్స్ కు ఫ్రీగానే అందుబాటులోకి వచ్చింది.
ప్రైమ్ వీడియో మరియు మేకర్స్ మహేష్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ప్రచారం చేయకపోయినా.. థియేటర్లో సినిమా చూడని చాలా మంది ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫారమ్ లో ఆనందిస్తున్నారు.
అయితే సర్కారు వారికి థియేట్రికల్ రిలీజ్ అప్పుడు ఎలాంటి టాక్ వచ్చిందో.. ఓటీటీలోనూ అలాంటి స్పందనే తెచ్చుకుంటోంది. ఒక సూపర్ స్టార్ ని పెట్టుకొని పరశురాం ఇలాంటి సినిమా ఎలా తీయగలిగాడు? అసలు మహేష్ ఈ పేలవమైన కథను ఎలా ఒకే చేశారు? అని కామెంట్స్ చేస్తున్నారు.
బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఎగ్గొట్టే ఆర్థిక నేరగాళ్ల పాయింట్ SVP మూవీ లో టచ్ చేశారు. కానీ అది ఆడియన్స్ కు ఏమాత్రం కనెక్ట్ అవ్వలేదు. అంతేకాదు బ్యాంకింగ్ వ్యవస్థ గురించి బాగా తెలిసిన వారు సినిమాలో మెయిన్ చూసి ట్రోల్ చేస్తున్నారు.
ఇందులో ఒక బిగ్ షాట్ బ్యాంకు నుంచి పది వేల కోట్ల రుణం తీసుకుని చెల్లించనందుకు బ్యాంక్ అధికారిని అరెస్టు చేయబడుతుంది. ఏ సందర్భంలోనైనా బ్యాంక్ ఆఫీసర్ భారీ లంచాలు తీసుకుంటేనో లేదా చట్టవిరుద్ధ ప్రయోజనాలను పొందితేనో తప్ప అరెస్టు చేయబడరు. కానీ SVP లో అదే కోర్ పాయింట్ అయింది.
అంతేకాదు హీరో పాత్రకు సినిమాలో కోర్ పాయింట్ కు సరిగా కనెక్ట్ చేయలేకపోయారు. తనది కాని ప్రతీకారాన్ని హీరో పాత్ర నెత్తికెత్తుకోవడమే ఆడియన్స్ కు ఎక్కలేదు. మహేష్ బాబు లాంటి స్టార్ నుంచి ఇలాంటి సినిమాని అసలు ఎక్సపెక్ట్ చేయలేదని ఓటీటీ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సినిమాలోని డబుల్ మీనింగ్ డైలాగ్స్ - చికాకు పెట్టే సన్నివేశాలపై విమర్శలు చేస్తున్నారు. సర్కారు వారి పాట అన్ని కోట్లు సాధించిందంటే కేవలం మహేష్ స్టార్ పవర్ వల్లనే అని ఓటీటీ ఆడియన్స్ తేల్చేశారు.