యూఎస్ ప్రీ సేల్స్ లో సర్కారు వారి జోరు..!

Update: 2022-05-11 09:16 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా రేపు గురువారం (మే 12) భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. యూఎస్ఏ లో ఈరోజు బుధవారం ప్రీమియర్స్ పడనున్నాయి. మహేష్ కు దేశీయ మార్కెట్ తో పాటు ఓవర్సీస్ లోనూ మంచి మార్కెట్ ఉంది. గతంలో ఆయన సినిమాలు అక్కడ మిలియన్ల డాలర్లు రాబట్టాయి.

ఇప్పుడు 'సర్కారు వారి పాట' సినిమాకు కూడా యుఎస్ లో సాలిడ్ బజ్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి. దీనిని బట్టి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ట్రేడ్ ప్రకారం, యుఎస్ లో ఈ సినిమా ప్రీమియర్ ప్రీ-సేల్స్ $650K మార్కును క్రాస్ చేసినట్లు తెలుస్తోంది.

యూఏస్ లో థియేటర్ చైన్స్ 'డాక్టర్ స్ట్రేంజ్' సినిమాను ప్రదర్శిస్తున్నందున 'సర్కారు వారి పాట' కు చాలా వరకు బిగ్ స్క్రీన్స్ ఇవ్వలేదు. అయినప్పటికీ 448 లొకేషన్స్ లో 650K డాలర్లు రాబట్టగలిగిందంటే.. యుఎస్ లో SVP మేనియా ఉందని చెప్పవచ్చు.

ఇటీవల కాలంలో టాలీవుడ్ స్టార్స్ నటించిన సినిమాల యూఏస్ ప్రీ సేల్స్ పరిశీలిస్తే.. 'సర్కారు వారి పాట' టాప్ లో ఉంది. భీమ్లానాయక్ ($610K) - రాధేశ్యామ్ ($600K) - పుష్ప ($510K) - ఆచార్య ($500k) సినిమాలు ఈ వరుసలో ఉన్నాయి.

ప్రీమియర్స్ తో సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే తప్పకుండా ఫస్ట్ వీకెండ్ లో కలెక్షన్లు మెరుగవుతాయి. కాబట్టి అమెరికాలో సర్కారు వారి పాట చిత్రానికి భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇండియాలో కూడా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

SVP చిత్రానికి దాదాపు 125 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా హిట్ అవ్వాలంటే థియేట్రికల్ బిజినెస్ నుండి ఆ మొత్తాన్ని వసూలు చేయాలి. పరిస్థితులను బట్టి చూస్తే.. ఇది అంత తేలికైన పని కాదు. కాకపోతే మేకర్స్ మాత్రం ఈ కంటెంట్ పై చాలా నమ్మకంగా ఉన్నారు. చాలా సులభంగా బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.

'సర్కారు వారి పాట' చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. ఇందులో. మహేశ్ బాబు సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్ టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి.
Tags:    

Similar News