సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా రూపొందిన సర్కారు వారి పాట సినిమా ఇటీవల విడుదల అయిన విషయం తెల్సిందే. సర్కారు వారి పాట కు మొదట నెగిటివ్ టాక్ వచ్చినా కూడా లాంగ్ రన్ లో సాలిడ్ వసూళ్లు నమోదు అయినట్లుగా యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. టికెట్ల రేట్లు అధికంగా ఉండటంతో చాలా మంది ప్రేక్షకులు సర్కారు వారి పాట ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు.
సర్కారు వారి పాట నాలుగు వారాల్లో ఓటీటీ లోకి వస్తుందని అంతా ఆశించారు. అనుకున్నట్లుగానే సర్కారు వారి పాట ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యింది. కాని పే పర్ వ్యూ పద్దతిన ఇన్ని రోజులుగా సర్కారు వారి పాట సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
కాని అమెజాన్ రెగ్యులర్ సబ్ స్క్రైబర్స్ మాత్రం ఇప్పటి వరకు అందుబాటులో లేదు. తాజాగా సర్కారు వారి పాట సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ వచ్చింది.
అమెజాన్ లో ఈ సినిమా ను తెలుగు తో పాటు తమిళం మరియు మలయాళం లో కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. జూన్ 23న సర్కారు వారి పాట అమెజాన్ లో స్ట్రీమింగ్ కాబోతున్న నేపథ్యంలో అభిమానులు మరియు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదల అయిన ఆరు వారాల తర్వాత సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు ఇవ్వడం జరిగింది.
అమెజాన్ లో ఈమద్య కాలంలో పే పర్ వ్యూ పద్దతిన స్ట్రీమింగ్ చేయడం పట్ల ఇండస్ట్రీ వర్గాల వారు అసంతృప్తితో ఉన్నారు. కొందరు విడుదల అయిన వెంటనే ఇలా స్ట్రీమింగ్ చేస్తే థియేటర్లకు వచ్చేది ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం సినిమా ను థియేటర్ లతో పాటు ఓటీటీ లో కూడా చూసేందుకు ఆసక్తి గా ఉన్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సినిమాకు థమన్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కళావతి మరియు మమ మహేష పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇటీవల విడుదల అయిన మురారివా పాట కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. సర్కారు వారి పాట లో నదియా.. నాగబాబు.. సముద్రఖని.. సుబ్బరాజు.. వెన్నెల కిషోర్ ఇంకా ప్రముఖ నటి నటులు నటించారు.