సరైనోడు.. డీజె బంగారు గనిలా దొరికాయే

Update: 2019-08-06 09:38 GMT
మన తెలుగు సినిమాలంటే చాలు హిందీ ప్రేక్షకులు వెర్రెత్తిపోతున్నారు. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకు యూట్యూబ్ లో కనీవినీ ఎరుగని రీతిలో ఆదరణ దక్కుతోంది.  దానికి ఆదరణ అనే పదం కూడా సరిపోదు.  ఎందుకంటే ఆ వ్యూస్ రికార్డులు చూస్తే.. బన్నీ బాలీవుడ్ హీరోనా లేక సౌత్ హీరోనా అనే అనుమానం రావడం ఖాయం.

ఇప్పటికే అల్లు అర్జున్ నటించిన 'సరైనోడు' హిందీ వెర్షన్ ను గోల్డ్ మైన్ టెలిఫిలిమ్స్ వారు తమ ఛానెల్ లో విడుదల చేస్తే భారీ వ్యూస్ తో బిలియన్ల కొద్దీ వ్యూస్ తో సంచలనం సృష్టించింది.  ఆ తర్వాత 'డీజే-దువ్వాడ జగన్నాధం' సినిమాది కూడా అదే తంతు. కానీ వాటిని యూట్యూబ్ వారు సస్పెండ్ చేయడంతో వ్యూస్ కౌంట్ జీరో అయింది.  అయితే గోల్డ్ మైన్ టెలిఫిలిమ్స్ వారు మరోసారి వాటిని అప్లోడ్ చేయడం జరిగింది.  అవి మళ్ళీ గతంలో సంచలనం సృష్టించినట్టే రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం 'సరైనోడు' కు 200 మిలియన్ వ్యూస్ ఉంటే 'డీజె' కు 152 మిలియన్ (1.52 బిలియన్) వ్యూస్ నమోదు చేశాయి.  గోల్డ్ మైన్ వారి డబ్బింగ్ సినిమాల లిస్టులో హయ్యెస్ట్ వ్యూస్ ఉన్న టాప్ 2 చిత్రాలు ఇవే.  ఇక మూడవ స్థానంలో రామ్ నటించిన 'ఉన్నదీ ఒకటే జిందగీ' నిలిచింది. ఈ సినిమాకు 111 మిలియన్ వ్యూస్ ఉన్నాయి.

ఇలా 20 కోట్లు.. 15 కోట్లు.. 10 వ్యూస్ సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు.  నిజంగా హిందీ ఆడియన్స్ కు ఈ సినిమాలు పిచ్చపిచ్చగా నచ్చి ఉండకపోతే ఎందుకు అన్ని సార్లు చూస్తారు?  ఏదేమైనా మన తెలుగు స్టార్ హీరోల సినిమాలు వ్యూస్ విషయంలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ ట్రెండ్ ఫ్యూచర్ లో కూడా కొనసాగేలానే ఉంది.


Tags:    

Similar News