ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ సినిమా ఏది? ఫెయిల్యూర్లతో పాటే.. ఈ ఏడాది భారీ హిట్ లు కూడా పడ్డాయి. నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనతో మొదలు పెట్టి రికార్డుల మోత మొదలైతే.. ఆ తర్వాత అల్లు అర్జున్ సరైనోడు చాలా లెక్కలనే మార్చేసింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ బన్నీ ఖాతాలోనే ఉంటుందా అనుకునే టైమ్ లో.. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ వచ్చి.. కొత్త లెక్కలు సెట్ చేసింది. మధ్యలో పవన్ సర్దార్.. మహేష్ బ్రహ్మోత్సవంలు నిరుత్సాహపరిచాయి.
ఓవరాల్ కలెక్షన్స్ విషయంలో ఇది కరెక్టే కానీ.. ప్రస్తుతం ఇండస్ట్రీ జనాలు కానీ ఆడియన్స్ కానీ పెద్దగా పట్టించుకోని ఓ రికార్డు ఉంది. ఫిఫ్టీ డేస్ సెంటర్స్ అనే బెంచ్ మార్క్ కొన్ని దశాబ్దాల పాటు ఫ్యాన్స్ తో పాటు హీరోలు అందరికీ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు జనతా గ్యారేజ్ కు 50 రోజుల పోస్టర్ పడింది. సెప్టెంబర్ 1న వచ్చిన ఈ సినిమా.. అక్టోబర్ 20తో 50డేస్ పూర్తి చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 39 సెంటర్లలో గ్యారేజ్ అర్ధ శతదినోత్సవం పూర్తయింది.
కానీ అల్లు అర్జున్ సరైనోడు మాత్రం ఈ విషయంలో టాప్ లో ఉన్నాడు. ఏకంగా 116 సెంటర్లలో సరైనోడు ఫిఫ్టీ డేస్ పూర్తి చేసుకున్నాడు. ఇంకో విషయం ఏంటంటే.. ఇదే ఏడాది పొంగల్ కి వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన 110 సెంటర్లలో 50 రోజుల పాటు దిగ్విజయంగా ఆడింది. ఇక ఇండస్ట్రీ డిజాస్టర్ల జాబితాలో చేరిన బ్రహ్మోత్సవం 2 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోగా.. పవన్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ 4 సెంటర్లలో ఆడిందంతే. ఆ విధంగా 50 డేస్ సెంటర్లలో సరైనోడు తన సత్తా చాటేశాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/