అందుకే చంపేశాను అంటున్న కట్టప్ప

Update: 2017-03-26 15:17 GMT
''కేవలం తమిళనాడులో తప్పించి.. అన్ని ఊళ్ళలోనూ నా పేరు కట్టప్పే. నాకు ఈ పాత్రను ఇచ్చి చాలా పెద్ద సత్కారం చేశారు నిర్మాతలు.. రాజమౌళి.. అలాగే అందరూ'' అంటూ ఆనంపడ్డాడు 'కట్టప్ప' ఎలియాస్ సత్యరాజ్. ఈయన తెలుగలో మిర్చి వంటి సినిమాలో తండ్రి పాత్రలు పోషించి ఎంత ఫేమస్ అవుతున్నా కూడా.. బాహుబలిః ది బిగినింగ్ మాత్రం ఆయనకు కొత్త స్థానం కలిపించింది. అయితే ఈ సందర్భంగా అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు ఆన్సర్ చెప్పేశాడు. ఓ రేంజులో ఛమత్కరించాడు.

''బాహుబలిని ఎందుకు చంపానంటే.. ప్రొడ్యూసర్ బాగా డబ్బులిచ్చాడు.. రాజమౌళి చెప్పాడు.. అందుకే చంపేశాను. లేకపోతే నా డార్లింగ్ ప్రభాస్ ను ఎందుకు చంపుకుంటాను? మిర్చి నుండి మా మధ్యన అనుబంధం ఉంటే'' అంటూ ఛమత్కరించాడు సత్య రాజ్. నిజంగానే బాహుబలి సినిమాకు కట్టప్ప క్యారక్టర్ చాలా కీలకమైంది. పైగా మనోడు ఇచ్చిన ఆ టెరిఫిక్ పెర్ఫామెన్స్ ఏదైతే ఉందో.. అది మాత్రం కేకలు. అందుకే ఆయనకు అంత పేరు వచ్చింది. అయితే రెండో పార్టులో కూడా కట్టప్ప చేసిన రోల్ అంతకంటే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుంది అంటూ చెప్పాడు.

ఏదేమైనా కూడా.. కట్టప్ప అసలు ఎందుకు చంపుంటాడు అనే ప్రశ్నపై ఛమత్కారాలు కాకుండా నిజం ఏంటనేది తెలుసుకోవడానికి ఏప్రియల్ 28 వరకు ఆగాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News