వీడియో సెటైర్: సందీప్ చెప్పింది టాక్సిక్ లవ్వంట!

Update: 2019-07-09 04:20 GMT
సందీప్ వంగా బాలీవుడ్ డెబ్యూ 'కబీర్ సింగ్' కిరాక్ హిట్ అని మనమే కాదు బాలీవుడ్ మీడియా కూడా కోడై కూస్తోంది.  అయితే అదే సమయంలో 'కబీర్ సింగ్' పై మెజారిటీ బాలీవుడ్ క్రిటిక్స్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.   సినిమా సూపర్ డూపర్ బంపర్ హిట్ కావడంతో దాదాపు క్రిటిక్స్ అందరూ డిఫెన్స్ లో పడ్డారు.

కానీ ఈ సమయంలో సందీప్ వంగా సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టుగా ఇంటర్వ్యూలో వారిపై విరుచుకుపడ్డాడు. పైగా లవ్ కు కొత్త డెఫినిషన్ కూడా ఇచ్చాడు.  ఎస్ఐ యూనిట్స్ లో మీటర్ కు కేజీ కి డెఫినిషన్ ఉన్నట్టు లవ్ కు ఇంతవరకూ డెఫినిషన్ లేదు.  వర్మ లవ్వు వేరు.. మణిరత్నం లవ్వు వేరు.. సూరజ్ బరజాత్య లవ్వు వేరు.. కరణ్ జోహార్ లవ్వు వేరు.  టెంప్ట్ రవి లవ్వు అంతకన్నా వేరు.  ఇప్పుడు ఇవన్నీ కాకుండా సందీప్ లవ్ డెఫినిషన్ "కొట్టడం కామనే.. కొట్టించుకోవడం కామనే.. ఆ మాత్రం చనువు లేకపోతే అదో లవ్వే కాదు రియల్ లవ్వే కాదు ఫో ఫో" అనడంతో అది విమర్శకులకు అస్త్రం ఇచ్చినట్టయింది.

సరిగా ఈ విషయంపై బాలీవుడ్ నటి కుబ్రా సేట్ ఒక సెటైరికల్ వీడియో ను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ వీడియో కు "మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ను కొట్టలేకపోతే.. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ టచ్ చేయలేక పోతే.. అక్కడ ఎమోషన్ లేనట్టే -SRV(నేను సెటైర్ వేస్తున్నా!  అది లవ్ కాదు సర్.  ప్రేమను అలా ఎవరూ నిర్వచించరు.  అది విష పూరితమైన వాస్తవ సంబంధం.. అలాంటిది ఉండకూడదు).  నాతో ఈ ఫీట్ చేసినందుకు థ్యాంక్ యూ గోల్డీ బెహల్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక వీడియోలో సందీప్ చెప్పినట్టుగా ఒకరిని ఒకరు స్లో మోషన్ లో చెంపదెబ్బ కొట్టుకున్నారు. ఈ గోల్డీ బెహల్ ఎవరో కాదు... సోనాలి బెంద్రే భర్త.

ఈ వీడియోకు మిక్స్డ్  రెస్పాన్స్ వచ్చింది. మెజారిటీ నెటిజన్లు సందీప్ వంగాను సపోర్ట్ చేశారు.  మీకు బూతే కరెక్టు.. సేక్రేడ్ గేమ్స్.. లస్ట్ స్టోరీస్ అన్నీ మీకు నార్మల్ గా కనిపిస్తాయి. ట్రూ లవ్ ను ఇంటెన్స్ గా చూపిస్తే మీరు విమర్శిస్తారు అంటూ ఈ కుబ్రా సేట్ పై విరుచుకుపడ్డారు. కానీ కొందరు మాత్రం సందీప్ లాజిక్ కరెక్ట్ కాదని.. చెంపదెబ్బలు కొట్టుకోకపోతే లవ్వు కాదనే లాజిక్ సరిగా లేదని విమర్శిస్తున్నారు.


వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News