యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “లవ్ స్టోరీ”. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ - అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను సోమవారం చిత్ర బృందం రిలీజ్ చేసింది.
శేఖర్ కమ్ముల మార్క్ సెన్సిబుల్ లవ్ స్టోరీ - ఎమోషన్స్ తో కూడిన ఈ ఫ్రెష్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఎన్నాళ్ళుగానో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే విడుదలైన కొన్ని గంటల్లోనే 5.2 మిలియన్ కు పైగా వ్యూస్.. 340K లైక్స్ తో యూట్యూబ్ ట్రెండ్స్ లో టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది. అదే సమయంలో ఇందులోని ఓ డైలాగ్ పొలిటికల్ నేపథ్యంలో కాంట్రవర్సీ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. 'లవ్ స్టోరీ' ట్రైలర్ లో నాగచైతన్య తెలంగాణ యాసలో చెప్పిన ''రిక్షావోడికి కొత్త రిక్షా ఇస్తే వాడు రిక్షా నే తొక్కుతాడు.. గొర్రెలోనికి గొర్రెలు ఇస్తే వాడు గొర్రెలే మేపుతాడు.. ఇంకేమి డెవలప్ అవుతాం సార్'' అనే డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే ఇది పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వం మీద సెటైర్ వేస్తున్నట్లు ఉందని కొంతమంది టీఆర్ఎస్ మద్దతుదారుల నుంచి సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గవర్నమెంట్ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఓ సామాజిక వర్గాభివృద్ధికి దోహదపడుతుందనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చినప్పటికి.. అప్పట్లో దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేసాయి. ఇప్పుడు 'లవ్ స్టోరీ' సినిమాలో గొర్రెలు ఇస్తే గొర్రెలే మేపుతాడు.. ఇంక డెవలప్ ఎలా అవుతారనే డైలాగ్ ద్వారా శేఖర్ కమ్ముల పరోక్షంగా ఆ పథకంపై విమర్శలు చేస్తున్నారని పలువురు టీఆర్ఎస్ సపోర్టర్స్ అభిప్రాయపడుతున్నారు.
అయితే శేఖర్ కమ్ముల అలాంటి ఉద్దేశ్యంతో ఈ డైలాగ్ పెట్టి ఉండరని అభిమానులు అంటున్నారు. ఆయన తెరకెక్కించిన 'ఫిదా' సినిమాను ప్రశంసించిన కెసిఆర్ - కేటీఆర్ ల పట్ల ఈ విధంగా వ్యవహరించడని కామెంట్స్ చేస్తున్నారు. ఇది కేవలం సినిమాలో డైలాగ్ మాత్రమే అని.. అందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. నిజానికి శేఖర్ కమ్ములతో పాటుగా మిగతా 'లవ్ స్టోరీ' టీమ్ అంతా వివాదాలకు దూరంగా ఉండేవారే. సినిమాలో ఈ డైలాగ్ పెట్టడంలో వేరే ఉద్దేశ్యాలు కచ్చితంగా ఉండవని అంటున్నారు.