నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఎంత మంచివాడవురా చిత్రం రేపు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం విడుదల సందర్బంగా పలు మీడియా సంస్థలకు కళ్యాణ్ రామ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఒక ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ తన తమ్ముడు ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధంను గురించి చెప్పుకొచ్చాడు. వీరిద్దరు గత కొంత కాలంగా చాలా అన్యోన్యంగా ఉండటం నందమూరి అభిమానులకు కన్నుల పండుగగా ఉంది.
కళ్యాణ్ రామ్ దాదాపు అన్ని సినిమాలకు ఎన్టీఆర్ మద్దతుగా నిలుస్తున్నాడు. ఎంత మంచి వాడవురా సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కు కూడా ఎన్టీఆర్ హాజరు అయ్యి అన్నయ్య సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ ను కళ్యాణ్ రామ్ ఎక్కువగా నాన్న అంటూ పిలవడం జరుగుతుంది. ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో అయినా లేదంటే మామూలుగా పిలిచే సమయంలో అయినా కూడా ఎన్టీఆర్ ను నాన్న అంటూ కళ్యాణ్ రామ్ పిలుస్తాడు.
తాజాగా ఆ విషయమై కళ్యాణ్ రామ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తారక్ నాకు చాలా ప్రత్యేకం. అందుకే నేను ఎప్పుడు కూడా తారక్ ను తమ్ముడు అని పిలవను. ఎప్పుడు కూడా నాన్న అని పిలుస్తాను. అసలు నాకు తమ్ముడు అని పిలవడం ఇష్టం ఉండదన్నాడు. మా నాన్న మా పట్ల చాలా బాధ్యతగా వ్యవహరించే వారు. తండ్రిగా మాకు చాలా ధైర్యంను ఇచ్చే వారు. ఆ కారణం వల్ల కూడా తారక్ ను నేను నాన్న అని పిలుస్తుంటాను అన్నాడు.