స‌త్య‌దేవ్ మెర్క్యూరి సూరి ఫుల్ బాటిల్‌ క‌హానీ!

Update: 2022-11-02 06:30 GMT
విభిన్న‌మైన సినిమాల‌తో త‌న‌దైన పంథాలో ముందుకు సాగుతున్నాడు వెర్స‌టైల్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్‌. హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా, విల‌న్ గా.. ఇలా బ‌హుముఖ ప్రతిభ క‌లిగిన న‌టుడిగా త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నాడు. మంచి పాత్ర, పాత్ర‌కు త‌గ్గ ప్రాధాన్య‌త వున్న సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గానూ, విల‌న్ గానూ క‌నిపించి క‌నువిందు చేస్తున్నాడు. స‌త్య‌దేవ్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఫుల్ బాటిల్‌'. శ‌ర‌ణ్ కొప్పిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగే విభిన్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో, వినూత్న‌మైన క్యారెక్ట‌రైజేష‌న్ తో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు.

ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. స‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రామాంజ‌నేయులు జ‌వ్వాజి, ఎస్ డీ కంప‌నీ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. శ‌ర‌ణ్ కొప్పిశెట్టితో 'తిమ్మ‌రుసు' వంటి యాక్ష‌న్‌ థ్రిల్ల‌ర్ త‌రువాత‌ స‌త్య‌దేవ్ చేస్తున్న రెండవ సినిమా ఇది. సంజ‌న ఆనంద్ హీరోయిన్ గా న‌టిస్తోంది. బుధ‌వారం ఈ మూవీలోని స‌త్య‌దేవ్ పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తూ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు.

మాసీయెస్ట్, క్రేజీయెస్ట్ మెర్క్యూరి సూరి.. పాద‌ర‌సం లాంటి మ‌నిషి అంటూ స‌త్య‌దేవ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తూ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని అభిమానుల‌తో షేర్ చేసుకున్నాడు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లో ఆల్ట్రా మెడ్ర‌న్ హెయిర్ క‌ట్ తో చెవికి శిలువ లాంటి చెవి పోగుతో పాటు రెండు చేతుల్లో లిక్క‌ర్ క‌లిపిన గ్లాసులు ప‌ట్టుకుని స‌త్య‌దేవ్ క‌నిపిస్తున్న తీరు కొత్త‌గా వుంది.

ఇక పోస్ట‌ర్ పై కాకినాడ పోర్ట్, లైట్ హౌస్‌, రెండు పుల్ బాటిల్స్‌, కొర‌మీను చేప‌లు.. కింత రెండు ఆటోలు.. ఆ కింద స‌ముద్రంలో ఓ ప‌డ‌వ‌.. రెండు మైక్ సెట్ లతో సినిమా కాన్సెప్ట్ చాలా వెరైటీగా వుంటుంద‌ని తెలియ‌జేస్తున్నాయి.

సినిమా అంతా కాకినాడ పోర్ట్ నేప‌థ్యంలో సాగుతుంద‌ని తెలుస్తోంది. సినిమాలో స‌త్య‌దేవ్ మెర్క్యూరి సూరి అనే పాత్ర‌లో న‌టిస్తున్నాడు. త‌న పాత్ర పాద‌ర‌సంలా ప‌రిస్థితుల‌ని బ‌ట్టి మారిపోతూ వుంటుంద‌ని సింబాలిక్ గా చూపించారు. పూర్తి స్థాయి వినోదాత్మ‌కంగా స‌త్య‌దేవ్ పాత్ర సాగుతుంద‌ని తెలుస్తోంది. పోస్ట‌ర్ లో అదే క‌నిపిస్తోంది. క‌ళ్ల‌కు గాగుల్స్ ధ‌రించి స‌త్య‌దేవ్ చాలా జాలీగా క‌నిపిస్తున్న తీరు సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. గ‌త సినిమాకు పూర్తి భిన్నంగా సత్య‌దేవ్ పాత్ర వుంటుంద‌ని ఫ‌స్ట్ లుక్ తో స్ప‌ష్ట‌మ‌వుతోంది.

కొత్త త‌ర‌హా పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న స‌త్య‌దేవ్ నుంచి వ‌స్తున్న మ‌రో వెరైటీ సినిమాగా 'ఫుల్ బాటిల్' వుండ‌నుంద‌ని ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తో స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ మూవీకి సినిమాటోగ్ర‌ఫీ సుజాత సిద్ధార్ధ్‌, ఎడిటింగ్ సంతోష్ కామిరెడ్డి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News