ఇదే లాస్ట్ సినిమా అంటున్న త్రిష హీరో

Update: 2016-03-14 04:20 GMT
కమెడియన్లు హీరోలు అయిపోవడం కొత్త కాదు కానీ.. ఊహించని రేంజ్ లో స్టార్ హీరోయిన్ పక్కన హీరోగా నటించడం అంటే మాత్రం పెద్ద విషయమే. ఇప్పుడు సత్యం రాజేష్ పరిస్థితి ఇలాగే ఉంది. చిన్న చిన్న కమెడియన్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్న రాజేష్.. ఇప్పుడు ఏకంగా త్రిష పక్కన హీరోగా నటించేస్తున్నాడు. ఈ చెన్నై బ్యూటీ లీడ్ రోల్ వస్తున్న నాయకి మూవీలో సత్యం రాజేష్ హీరోగా చేస్తున్నాడు.

హీరో అవుదామని అనుకోలేదని.. ఇలా తను హీరోగా చేసే మొదటి, చివరి సినిమా నాయకి మాత్రమే అంటున్నాడు సత్యం రాజేష్. తనను హీరోగా పెట్టి సినిమా చేస్తానని సినిమా దర్శకుడు గోవర్ధన్ 2008 నుంచి చెబుతున్నాడట. కనీసం ఇప్పటివరకూ అతనితో వర్క్ చేయకపోయినా.. అతను అదే మాట నిలబడ్డంతోనే ఒప్పుకున్నానని అన్నాడు. సత్యం రాజేష్ ని హీరోగా తీసుకోవడంపై అందరూ నవ్వి ఎగతాళి చేసినా, ఏ మాత్రం ఖాతరు చేయకుండా సినిమా చేస్తున్న గోవర్ధన్ పై ప్రశంసలు కురిపిస్తున్నాడు ఈ కమెడియన్ హీరో.

12 ఏళ్ల కెరీర్ లో 350కి పైగా సినిమాలు చేసిన తాను.. ఇప్పుడు హీరో కావాలని అనుకోవడం అర్ధం లేదన్న రాజేష్.. భవిష్యత్తులో కమెడియన్, కేరక్టర్ ఆర్టిస్ట్ నుంచి విలన్ వరకూ అన్ని రోల్స్ చేస్తాను కానీ.. హీరోగా మాత్రం ఎప్పటికీ నటించబోనని చెప్పాడు. తను ఓ ఆర్టిస్ట్ మాత్రమే అని చెప్పాడు సత్యం రాజేష్.
Tags:    

Similar News